ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అనుమానితురాలు: పిళ్లైకి ఈ నెల 20 వరకు ఈడీ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్రపిళ్లైకి నాలుగు రోజుల పాటు కస్టడీని కోర్టు పొడిగింది. కస్టడీని పొడిగించాలని ఈడీ కోరడంతో కోర్టు అంగీకరించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్రపిళ్లై కస్టడీని పొడిగించాలని ఈడీ అధికారులు గురువారంనాడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈడీ వినతి మేరకు ఈ నెల 20వ తేదీ వరకు అరుణ్ రామచంద్రపిళ్లైకి కస్టడీని పొడిగించింది కోర్టు.
ఇవాళ్టితో అరుణ్ రామచంద్రపిల్లై కస్టడీ ముగియనుంది. దీంతో రౌస్ అవెన్యూ కోర్టులో పిళ్లైని హాజరుపర్చారు ఈడీ అధికారులు. అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీని పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. అయితే కస్టడీని కోర్టు పొడిగించింది .
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్రపిళ్లైకి మూడు రోజుల పాటు కస్టడీని కోర్టు పొడిగింది. కస్టడీని పొడిగించాలని ఈడీ కోరడంతో కోర్టు అంగీకరించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను అరుణ్ రామచంద్రపిళ్లైను కలిపి విచారించాల్సిన అవసరం ఉందని ఈడీ అధికారులు కోర్టుకు తెకలిపారు . అందరిని కలిపి విచారిస్తే ఎలా అని కోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అనుమానుతురాలిగా ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఇవాళ విచారణకు కవిత హజరు కాలేదని ఈడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. కవితతో కలిపి విచారణ చేయాల్సి ఉన్నందన అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీని పెంచాలని కోర్టును కోరారు. కోర్టు సానుకూలంగా స్పందించింది.
కవిత ఇవాళ విచారణకు హాజరు కాకుండా తన ప్రతినిధి ద్వారా పంపిన డాక్యుమెంట్లను కూడా ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు చూపారు. అరుణ్ రామచంద్రపిళ్లైతో కలిపి కవితను కూడా విచారించాల్సి ఉన్నందన కస్టడీని ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించాలని కోరింది.
also read:Delhi Liquor Scamలో సానుభూతి కోసం కవిత యత్నం: రేవంత్ రెడ్డి
మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కూడా ఈడీ అధికారులు నోటీసులు పంపారు. ఈ నెల 18న విచారణకు రావాలని ఆదేశించారు. కవిత కంటే ముందుగానే మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కూడా ఈడీ అధికారులు విచారించనున్నారు.