Asianet News TeluguAsianet News Telugu

విద్య‌నే నిజ‌మైన సంప‌ద‌.. దానిని ఎవ‌రూ దొంగ‌లించ‌లేరు - త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్

విద్యనే నిజమైన సంపద అని, దానిని ఎవరూ ఎత్తుకెళ్లలేరని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ప్రెసిడెన్సీ కళాశాల స్నాతకోత్సవంలో ఆయన స్టూడెంట్లకు పట్టాలు అందజేసి మాట్లాడారు. తమ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. 

Education is the real wealth.. no one can steal it - Tamil Nadu CM MK Stalin
Author
Chennai, First Published Jul 6, 2022, 12:09 PM IST

దొంగిలించలేని నిజమైన సంపద విద్య అని, యువత బాగా చదువుకోవాలని త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. యువ‌త‌ జీవితంలో బాగా అభివృద్ది చెందాల‌ని సూచించారు. విద్యారంగం ముఖ్యంగా ఉన్నత విద్య త‌ను కాలేజీల్లో ఉన్న రోజుల్లో కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలను సృష్టించడమే కాకుండా, విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలుగా ఆర్థిక సహాయాన్ని కూడా అందించిందని ఆయన తెలిపారు. 

కర్ణాటక జడ్జికి బదిలీ బెదిరింపు: ఏసీబీ ఉన్నతాధికారిపై ఆరోపణలు

మెరీనా బీచ్ కు ఎదురుగా ఉన్న ప్రెసిడెన్సీ కళాశాల స్నాతకోత్సవంలో స్టూడెంట్ల‌కు ఆయ‌న మంగ‌ళవారం డిగ్రీ సర్టిఫికెట్ల‌ను సీఎం స్టాలిన్ అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. ‘‘ నేను ఇక్కడికి ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా, మద్రాస్ విశ్వవిద్యాలయం ఉనికిలోకి రావడానికి 17 సంవత్సరాల ముందు ప్రారంభించిన ఈ ప్రతిష్టాత్మక సంస్థ పూర్వ విద్యార్థిగా కూడా మిమల్ని పలకరించడానికి, మాట్లాడటానికి ఇక్కడకు వచ్చాను’’ అని ఆయ‌న అన్నారు. 

దేశంలోనే తొలిసారి.. ఫైటర్ జెట్ కలిసి నడిపిన తండ్రీ కూతుళ్లు..

ఈ కళాశాలలోనే సర్ పిట్టి త్యాగరాయ, యు.వి.స్వామినాథన్, సి.వి.రామన్, రాజాజీ సహా పలువురు ప్రముఖులు చ‌దువుకున్నార‌ని ఆయ‌న చెప్పారు.  విద్య అనేది ఒక సముద్రం లాంటిదని, ఈ కళాశాల అక్షరాలా సముద్రానికి దగ్గరగా ఉందని అన్నారు. కొన్ని కాలేజీల్లో మాత్రమే ఇలాంటి ప్రత్యేక ప్రకృతి దృశ్యాలు ఉన్నాయని సీఎం తెలిపారు. 1972 జూన్ 15వ తేదీన ప్రెసిడెన్సీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ కోర్సులో చేరినప్పటికీ, డీఎంకే తరఫున ప్రచారం చేసే బాధ్యతను తనపై మోపడం వల్ల రాజకీయాలు తనపై ఎక్కువ ప్రభావం చూపాయని స్టాలిన్ చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో (1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించారు) మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ (మీసా) చట్టం కింద నిర్బంధానికి గురైనందున త‌న చ‌దువును పూర్తి చేయ‌లేక‌పోయారు. 

‘‘ నేనే ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిని.. పార్టీని ముందుకు తీసుకెళ్తా ’’- వీకే శశికళ

‘‘ నేను నా చదువును కొనసాగించలేకపోయాను.నాతో పాటు 500 మందికి పైగా డీఎంకే సభ్యులను మిసా కింద నిర్బంధించారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించిన డీఎంకే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు ’’ అని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. నిర్బంధంలో ఉన్న సమయంలో పోలీసు రక్షణతో కాలేజీకి వచ్చి పరీక్ష రాశానని స్టాలిన్ తెలిపారు. ఇప్పుడు విద్యా పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని సూచించిన ముఖ్యమంత్రి, విద్యా సహాయం అందించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ఉన్నత విద్యను అందరికీ అందుబాటులో ఉంచడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

ప్రెసిడెన్సీ కాలేజీలో మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి పేరిట 2,000 మంది సీటింగ్ కెపాసిటీతో మెగా ఆడిటోరియంను ఏర్పాటు చేస్తామని, ఈ హెరిటేజ్ ఇనిస్టిట్యూట్ లో విద్యను అభ్యసిస్తున్న 300 మందికి పైగా దివ్యాంగ విద్యార్థులకు వసతి కల్పించడానికి ఒక హాస్టల్ ను కూడా నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. కాగా దీనిని 1840 లో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో మొద‌టి సారిగా స్థాపించిన అగ్ర క‌ళాశాల‌గా చెబుతుంటారు. అయితే 17 సంవత్సరాల తరువాత 1857 లో ప్రారంభమైన మద్రాసు విశ్వవిద్యాలయానికి దీనిని ‘త‌ల్లి’ అని అభివ‌ర్ణిస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios