Asianet News TeluguAsianet News Telugu

దేశంలోనే తొలిసారి.. ఫైటర్ జెట్ కలిసి నడిపిన తండ్రీ కూతుళ్లు..

ఓ కూతురు తండ్రి అడుగుజాడల్లో నడిచింది. తానూ పైలట్ అయ్యింది. అంతేకాదు తండ్రీ కూతుళ్లు కలిసి ఒకే ఫైటర్ జెట్ ను నడిపి చరిత్ర సృష్టించారు.  

Father daughter together flying fighter jets, creates history
Author
Hyderabad, First Published Jul 6, 2022, 10:49 AM IST

ఢిల్లీ : భారత వైమానిక దళం చరిత్రలో అరుదైన ఘటన జరిగింది. ఎయిర్ కమొడోర్ సంజయ్ శర్మ, ఆయన కుమార్తె ఫ్లయింగ్ ఆఫీసర్ అనన్య శర్మ  కలిసి ఫైటర్ జెట్ నడిపి రికార్డు సృష్టించారు. యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి తండ్రి కూతురుగా నిలిచారు. ఆ ఇద్దరూ కలిసి ఫైటర్ జెట్ ముందు ఫోజులిస్తున్న ఓ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.

Father daughter together flying fighter jets, creates history

1989లో వైమానిక దళంలో చేరిన తన తండ్రి సంజయ్ శర్త అడుగుజాడల్లోనే నడిచింది కూతురు అనన్య శర్మ కూడా. తాను కూడా సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించాలని నిశ్చయించుకుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో బీటెక్ పూర్తి చేసిన ఆమె వైమానిక దళంలో మొదటి మహిళా ఫైటర్  పైలెట్ల బృందం (2016)లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఫ్లయింగ్ బ్రాంచ్ శిక్షణకు ఎన్నికైంది.  

కఠిన శిక్షణ పొంది.. నిరుడు డిసెంబర్లో ఫైటర్ పైలెట్ గా నియామకం పొందింది. మే 30న కర్ణాటకలోని బీదర్ లోని  ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో హాక్ -132  ఎయిర్ క్రాఫ్ట్ లో ఈ  తండ్రీ కూతుళ్ళు ప్రయాణించి చరిత్ర సృష్టించారు.  ఓ మిషన్ కోసం ఇలా తండ్రి, కుమార్తె ఒకే యుద్ధ విమానంలో కలిసి ప్రయాణం చేయడం ఇదే మొదటిసారి అని వైమానిక దళం వెల్లడించింది. తండ్రి సంజయ్ తో కలిసి ఒక యుద్ధ విమానంలో ప్రయాణించడంతో అనన్య కల  సహకారం  అయినట్టు అయింది.  

అనన్య ప్రస్తుతం  బీదర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఫైటర్  క్రాఫ్ట్ లో  శిక్షణ పొందుతోంది. తండ్రి కూతురు కలిసి యుద్ధవిమానం ముందు దిగిన ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios