Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక జడ్జికి బదిలీ బెదిరింపు: ఏసీబీ ఉన్నతాధికారిపై ఆరోపణలు


కర్ణాటక హైకోర్టు జడ్జికి బదిలీ బెదిరింపులు వచ్చాయి.ఈ విషయాన్ని జడ్జి సందేశ్ కోర్టులో స్వయంగా ప్రకటించారు. ఏసీబీకి చెందిన ఉన్నతాధికారి తనను బదిలీ చేయిస్తానని చేసిన వ్యాఖ్యలను ఆర్డర్ లో కూడా పొందుపరుస్తానని కూడా ఆయన తేల్చి చెప్పారు. 

 Karnataka high Court  judge Alleges threatened of Transfer
Author
Bangalore, First Published Jul 6, 2022, 11:45 AM IST

బెంగుళూరు: Karnataka High Court  జడ్జికి బదిలీ బెదిరింపులు వచ్చాయి.ఈ విషయాన్ని Judgeస్వయంగా వెల్లడించారు. 
Banglore అర్బన్ మాజీ తహసీల్దార్ Mahesh  బెయిల్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు జడ్జిSandesh  ఈ విషయాన్ని వెల్లడించారు.  2021 మే మాసంలో రూ. 5 లక్షలు లంచం తీసుకొంటూ బెంగుళూరు అర్బన్ తహసీల్దార్  మహేష్ ఏసీబీకి పట్టుబడ్డాడు. అప్పటి బెంగుళూరు అర్బన్ డీసీజే మంజునాథ్ సూచన మేరకు తాను లంచం తీసుకున్నట్టుగా మహేష్ వాంగ్మూలం ఇచ్చాడు. ఈ కేసు విచారణ జరిగిన కొన్ని గంటల తర్వాత ఐఎఎస్ అధికారి మంజునాథ్ ను ఏసబీ అధికారులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఈ కేసులో రెండో నిందితుడు చేతన్ నియామక రికార్డులను అందించడంలో ఏసీబీ విఫలమైందని జస్టిస్ సందేశ్ విమర్శించారు.  ఈ కేసుపై గతంలో విచారణ చేసిన సమయంలో హైకోర్టు ఏసీబీని అవినీతి కేంద్రంగా అభివర్ణించింది. సోమవారం నాడు జస్టిస్ సందేశ్ ఓపెన్ కోర్టులో మాట్లాడారు. ఏడీజీపీ తన వ్యాఖ్యలపై అసంతృప్తిగా ఉన్నందున తనను బదిలీ చేయవచ్చని సహచర న్యాయమూర్తి తనకు తెలిపారని సందేశ్ చెప్పారు.

మీ ACB ఏడీజీపీ శక్తివంతమైన వ్యక్తిలా కన్పిస్తున్నాడన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు తనను Transfer చేయవదచ్చని న్యాయమూర్తి తనకు చెప్పారు. తాను బదిలీ బెదిరింపును ఆర్డర్ లో నమోదు చేస్తానని ఆయన హెచ్చరించారు. ఇది న్యాయవ్యవస్థ స్వాతంంత్ర్యానికి ముప్పుగా పరిణమించడమే కాకుండా న్యాయస్థానానికి కూడా వాటిల్లుతుందన్నారు.తాను బదిలీకి గురౌతాననే భయం తనకు లేదన్నారు. తాను ఎవరికీ భయపడనని చెప్పారు. తాను రైతు కొడుకునని చెప్పారు. సేద్యం చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని కూడా ఆయన తేల్చి చెప్పారు. తాను ఏ రాజకీయ పార్టీకి గానీ, లేదా ఏ సిద్దాంతానికి కూడా అనుబంధ:గా లేనని జస్టిస్ సందేశ్ తేల్చి చెప్పారు.రాజ్యాంగబద్దంగా మాత్రమే జడ్జిని అయినందున తాను ఎలాంటి ఆస్తిని కూడబెట్టుకోలేదన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios