జమ్మూకాశ్మీర్ లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.9 తీవ్రత నమోదు

ఈ ఏడాది ప్రారంభం నుంచి జమ్మూ కాశ్మీర్ ను భూకంపాలు వదలడం లేదు. తాజాగా దోడా జిల్లాలో మరో భూకంపం సంభవించింది. ఉదయం  5.38 గంటలకు వచ్చిన భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.9గా నమోదు అయ్యింది. 

Earthquake again in Jammu and Kashmir.. 4.9 magnitude on Richter scale..ISR

జమ్మూకాశ్మీర్ లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 4.9గా నమోదు అయ్యింది. దోడా జిల్లాలో ఉదయం 5.38 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. 

ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ గోల్వాల్కర్ పై వివాదాస్పద పోస్టు.. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదు

‘‘జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో 10-07-2023న భారత కాలమానం ప్రకారం భూమి కంపించింది. దీని లాట్: 33.15,  పొడవు: 75.68, లోతు: 10 కిలో మీటర్లుగా ఉంది’’ అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్వీట్ చేసింది. 

కాగా.. అండమాన్ నికోబార్ దీవుల్లో ఆదివారం రాత్రి 5.3 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.39 గంటలకు 70 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అలాగే ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాలో ఆదివారం 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్డీఎస్) తెలిపింది. 19:39:04 (యూటీసీ+05:30) కు 54.2 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 5.354 డిగ్రీలు, 94.569 డిగ్రీలుగా నమోదైనట్లు యూఎస్జీఎస్ తెలిపింది.

దారుణం.. కిరాణా షాపులో పని చేసే కూలీకి నిప్పంటించిన యజమాని.. కరెంట్ షాక్ వల్ల చనిపోయినట్టు సీన్ క్రియేట్..

మణిపూర్ లోని ఉఖ్రుల్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 3.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అర్ధరాత్రి 12.14 గంటలకు భూప్రకంపనలు వచ్చాయని, 70 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

బీజేపీతో చర్చలు జరిపాం.. కానీ ఆ పార్టీతో చేతులు కలపలేదు - ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్

భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే ఈ భూకంపాలకు కారణం. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో భూమి కంపిస్తుంది. దీనినే భూకంపం అని అంటారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios