బీజేపీతో చర్చలు జరిపాం.. కానీ ఆ పార్టీతో చేతులు కలపలేదు - ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్

బీజేపీతో చర్చలు జరిపిన మాట వాస్తవమే అని, కానీ అంత మాత్రనా ఆ పార్టీతో వెళ్లినట్టు కాదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఆ పార్టీతో చర్చలు జరిపామని తెలిపారు. 

We held talks with BJP... but did not join hands with that party - NCP chief Sharad Pawar..ISR

తాను బీజేపీతో చర్చలు జరిపిన మాట వాస్తవమే అని, కానీ ఆ పార్టీతో చేతులు కలపలేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా తాము అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, అలాగని తాము వారితో వెళ్తున్నట్టు కాదని తెలిపారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్సీపీ ఆలోచించిందని, కానీ తరువాత వెనక్కి తగ్గిందని ఆ పార్టీ తిరుబాటు నేత అజిత్ పవార్ ఆరోపించిన నేపథ్యంలో శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

బ్లూ ఫిల్మ్ లు చూపిస్తూ, తన ఫ్రెండ్స్ తోనూ అలాగే గడపాలని భార్యపై భర్త ఒత్తిడి.. గ్రూప్ సెక్స్ లో పాల్గొనాలంటూ

నాసిక్ జిల్లా యోలాలో శనివారం జరిగిన బహిరంగ సభలో శరద్ పవార్ పాల్గొన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ తరుఫున ఎమ్మెల్యేగా ఛగన్ భుజ్ బల్ గెలుపొందారు. ప్రస్తుతం ఆయన అజిత్ పవార్ వర్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. భుజ్ బల్ వంటి తప్పుడు వ్యక్తులను పార్టీ తరుఫున బరిలోకి దింపినందుకు బహిరంగంగా క్షమాపణలు చెపారు. తన తప్పును అంగీకరించారు.

2019 లోక్ సభ ఎన్నికల్లో సతారా నియోజకవర్గంలో తమ పార్టీ నుంచి గెలిచిన ఉదయన్ రాజే భోసలే తరువాత బీజేపీలో చేరారని ఆయన గుర్తు చేశారు. తరువాత వచ్చిన లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో తాను సతారా ప్రజలతో మాట్లాడి, రాజేను బరిలోకి దింపినందుకు క్షమాపణలు చెప్పానని తెలిపారు. తప్పు చేశానని అంగీకరించానని అన్నారు. తరువాత ఎన్సీపీ అభ్యర్థిపై రాజే ఘోరంగా ఓడిపోయారని గుర్తు చేశారు.

వామ్మో.. మెడలో పాములు వేసుకొని తిరిగిన వ్యక్తి.. అందరూ విషసర్పాలను వేస్తున్నా.. అభివాదం చేస్తూ.. వీడియో వైరల్

తాను ఎవరినీ విమర్శించడానికి రాలేదని, తన వైపు భారతదేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చెప్పడానికి వచ్చానని ఆయన అన్నారు. నాసిక్ జిల్లాకు భిన్నమైన చరిత్ర, వారసత్వం ఉందని, అనేక ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఎప్పుడూ లౌకిక, అభ్యుదయ భావజాలానికి అండగా నిలుస్తుందని పవార్ అన్నారు. యశ్వంత్ రావ్ చవాన్ ను ఢిల్లీకి పిలిపించి పండిట్ నెహ్రూ మంత్రివర్గంలో రక్షణ మంత్రిగా నియమించారని, అయితే ఆ సమయంలో చవాన్ నాసిక్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని శరద్ పవార్ అన్నారు. అందుకే నాసిక్ నుంచే పార్టీ పునర్నిర్మాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు. 

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాటించిన విలువలు అందరికీ స్ఫూర్తిదాయకం - కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

కాగా.. శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్, ఒకప్పుడు సన్నిహితులైన ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్బల్, దిలీప్ వాల్సే పటేల్ వంటి వారు ఎన్సీపీ చీఫ్ ను వీడి బీజేపీతో చేతులు కలిపారు. ఇటీవల అజిత్ పవర్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios