దారుణం.. కిరాణా షాపులో పని చేసే కూలీకి నిప్పంటించిన యజమాని.. కరెంట్ షాక్ వల్ల చనిపోయినట్టు సీన్ క్రియేట్..
కిరాణా షాపు యజమానికి అందులో పని చేసే కూలీకి గొడవ జరిగింది. దీంతో యజమాని తీవ్ర ఆగ్రహంతో కూలీకి నిప్పంటించాడు. కరెంట్ షాక్ వల్లే అతడు చనిపోయాడని పోలీసులకు, స్థానికులకు తెలిపాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
కర్ణాటకలోని మంగళూరులో దారుణం జరిగింది. ఓ కిరాణా షాపులో కూలీగా పని చేసే వ్యక్తిపై యజమాని క్రూరంగా ప్రవర్తించాడు. అతడికి నిప్పంటించి హతమార్చాడు. అనంతరం పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కరెంట్ షాక్ డ్రామా ఆడాడు. కానీ పోలీసుల విచారణలో నిజం బయటపడింది. దీంతో అతడిని అరెస్టు చేశారు.
హిమాచల్ ప్రదేశ్ వరదలు.. చూస్తుండగానే బియాస్ నదిలో కొట్టుకుపోయిన కారు.. వీడియో వైరల్
వివరాలు ఇలా ఉన్నాయి. మంగళూరులో ములిహిత్లుల ప్రాంతంలో తౌసిఫ్ హుస్సేన్ అనే వ్యక్తి కిరాణషాప్ నడుపుతున్నాడు. అందులో గజ్న అనే వ్యక్తి కూలీగా పని చేస్తున్నాడు. అయితే ఇటీవల వారిమధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో ఆ యజమాని ఆగ్రహానికి గురయ్యాడు. కోపంతో అతడికి నిప్పటించాడు. దీంతో బాధితుడు తీవ్ర గాయాలతో మరణించాడు.
బీజేపీతో చర్చలు జరిపాం.. కానీ ఆ పార్టీతో చేతులు కలపలేదు - ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్
దీనిని కప్పిపుచ్చుకునేందుకు, పోలీసులకు చిక్కుకుండా ఉండేందుకు ఈ ఘటనను విద్యుద్ఘాతకంగా చిత్రీకరించారు. కరెంట్ షాక్ వల్లే ఇలా జరిగిందని చెప్పాడు. అయితే బాధితుడిని స్థానికులు వెంటనే హాస్పిటల్ కు తరలించారు. దీంతో అతడు అప్పటికే మరణించినట్టు డాక్టర్లు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ దుకాణానికి చుట్టుపక్కల ఉండేవారందరినీ పోలీసులు విచారించారు. అనంతరం గజ్నను హతమార్చింది దుకాణ యజమాని తౌసిఫ్ హుస్సేన్ అని ఓ నిర్ధారణకు వచ్చారు. నిందితుడిని కూడా విచారించి, సాక్షాల ఆధారంగా మంగళూరు సౌత్ పోలీసులు అతడిని శనివారం అరెస్టు చేశారు. ఈ విషయాన్ని నగర పోలీసు కమిషనర్ కుల్దీప్ కుమార్ ఆర్ జైన్ తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.