Asianet News TeluguAsianet News Telugu

భర్త ఇంట్లోకి రాగానే షాకింగ్ సీన్.. కుర్చీలో స్పృహ లేకుండా భార్య.. రెండు శవాలు !

Punjab: భ‌ర్త ఇంటికి వ‌చ్చి.. త‌లుపులు తెరిచిచూడ‌గానే అతని భార్య కుర్చీలో కట్టేసి ఉంది. పక్క గదిలో మంటలు చెలరేగుతున్నాయి. ఆ గదిలో అతని తల్లిదండ్రుల మృతదేహాలు కాలుతున్నాయి. పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్ పూర్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 

Punjab : Woman kills in-laws with help of paramour
Author
Hyderabad, First Published Jan 3, 2022, 12:48 PM IST

Punjab: ఈ మ‌ధ్య కాలంలో అక్ర‌మ సంబంధాల‌తో ప‌చ్చని కాపురాన్ని పాడుచేసుకుంటున్న ఘ‌ట‌న‌లు నిత్యం వెలుగుచూస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే పంజాబ్‌లో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది.  వివ‌రాల్లోకెళ్తే.. పంజాబ్‌లోని హోషియార్ పూర్‌ జిల్లాలోని జాజా గ్రామంలో నివసించే రవీందర్ సింగ్ కు  2019లో మందీప్ కౌర్‌తో వివాహం జరిగింది. వివాహం జరిగిన సంవత్సరానికి ఉద్యోగ రీత్యా ర‌వీంద‌ర్ సింగ్ పోర్చుగల్ దేశానికి వెళ్లాడు. ఈ స‌మ‌యంలోనే క‌రోనా పంజా విస‌ర‌డం.. లాక్‌డౌన్ ఆంక్ష‌లు.. ప్ర‌యాణాలు నిలిచిపోవ‌డం జ‌రిగాయి. దీని  కారణంగా ర‌వీంద‌ర్ సింగ్  సంవత్సరం వరకు తిరిగిరాలేని ప‌రిస్థితి ఏర్ప‌డ‌టంతో అక్క‌డే ఉండిపోయాడు. అయితే, కొత్త సంవ‌త్స‌రం రోజునా అక్క‌డి నుంచి ఇంటికి వ‌చ్చాడు. చాలా కాలం త‌ర్వాత కుటుంబ సభ్యుల‌తో క‌ల‌వ‌డంతో సంతోషంగా గ‌డిపాడు. అలాగే, త‌న మిత్రుల‌ను క‌ల‌వ‌డానికి అదే రోజు బయటికి వెళ్లాడు. అలా వెళ్లిన అతను రాత్రి 10 గంటల తరువాత ఇంటికి వచ్చాడు.  ఇంటికి వ‌చ్చి త‌లుపు తట్ట‌గా ఎవరూ తీయలేదు. ఇంత‌లో కిటికీ, గుమ్మం నుంచి నుంచి పొగ రావడం గ‌మ‌నించి.. తలుపులు పగలకొట్టాడు. లోపలికి వెళ్లి చూడగా.. అతని భార్య మందీప్‌ను ఎవరో కుర్చీకి కట్టిపడేశారు. పక్కగదిలో నుంచి మంటలు వస్తున్నాయి. ఆ గదిలో అతని తల్లిదండ్రుల మృతదేహాలు ప‌డి ఉన్నాయి.

Also Read: coronavirus: దేశంలో భారీగా పెరిగిన క‌రోనా కొత్త కేసులు..

ఒక్క‌సారిగి షాక్ గురైన ర‌వీంద‌ర్‌.. తెరుకుని ఏం జరిగిందని భార్యను అడిగాడు. అప్పుడు మందీప్ అతనికి ముగ్గురు దొంగలు ఇంట్లో చొరబడ్డారని.. గదిలోని నగలు, డబ్బులు దొంగిలించి.. అడ్డువచ్చిన రవీందర్ తల్లిదండ్రులను హత్య చేశారని బోరున ఏడుస్తూ చెప్పింది. దీని గురించి వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు.. విచార‌ణ చేయ‌గా షాకింగ్ విష‌యాలు వెలుగుచూశాయి.  రవీందర్ పోర్చుగల్‌లో ఉన్నప్పుడు మందీప్ తన ఇంట్లో అత్తమామలతో గొడవపడేది. దానికి కారణం ఆమె ఫోన్‌లో గంటల తరబడి ఎవరితోనూ మాట్లాడుతూ స‌న్నిహితంగా ఉండడం. ఒకరోజు మందీప్ మరో పురుషుడితో దొంగచాటుగా మాట్లాడడం ఆమె మామ(రవీందర్ తండ్రి) చూశాడు. ఈ విషయం రవీందర్‌కు ఫోన్లో చెప్పాడు. కొద్ది రోజుల తరువాత మందీప్‌కు అదే గ్రామంలోని గురుద్వారా(సిక్కుల ప్రార్థనా స్థలం)లో పనిచేసే జస్మీత్ సింగ్‌తో సంబంధం ఉందని అత్తమామలకు అనుమానం కలిగింది. ఈ విష‌యం ర‌వీంద‌ర్ తెలియ‌డంతో ఇంటికి వ‌చ్చాడు.

Also Read: ఇద్దరు పురుషుల మధ్య ప్రేమ.. చివ‌రికి.. !

ఈ వివ‌రాల‌ను కూడా ర‌వీంద‌ర్ పోలీసుల‌కు చెప్ప‌డంతో పోలీసులు ఈ కోణంలో కూడా ద‌ర్యాప్తు చేశారు.  గ్రామంలోని గురుద్వారాలో పనిచేసే జస్మీత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిని పోలీసులు గట్టిగా విచారణ చేయగా.. అతను చేసిన త‌ప్పును అంగీక‌రించాడు.  ఇదంతా మందీప్ ప్లాన్ అని అతను చెప్పాడు. తాను కేవలం ఆమె చెప్పినట్లు చేశానని.. రవీందర్ ఇంట్లో లేని సమయంలో అక్కడికి వెళ్లి అతని తల్లిదండ్రులను కత్తితో పొడిచి హత్యచేశానని నేరం ఒప్పుకున్నాడు. హత్య చేశాక, ఇంట్లో దొంగతనం జరిగినట్లు కనిపించడానికి.. మందీప్‌ను తాళ్లతో కుర్చీకి కట్టేసి నగలు తీసుకెళ్లానని వాంగ్మూలం ఇచ్చాడు. నిందితులిద్ద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

Also Read: sex abuse case: సెక్స్‌ కుంభకోణంలో ట్రంప్‌, క్లింటన్‌.. మ‌రోసారి తెర‌పైకి జెఫ్రీ ఎప్‌స్టీన్‌

Follow Us:
Download App:
  • android
  • ios