Coronavirus: మెడికల్ కాలేజీలో 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా
Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దీంతో కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనకు గురిచేస్తున్నది. పాట్నాలోని నలందా మెడికల్ కళాశాల, ఆస్పత్రిలో పని చేస్తున్న 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపుతున్నది.
Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దీంతో కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనకు గురిచేస్తున్నది. దేశంలోని చాలా రాష్ట్రాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించింది. ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుదల అధికమవుతోంది. తాజాగా బీహార్ రాష్ట్రంలో చాలా మంది వైద్య విద్యార్థులు వైరస్ బారినపడటం కలకలం రేపుతున్నది. వివరాల్లోకెళ్తే.. పాట్నాలోని నలందా మెడికల్ కళాశాల, ఆస్పత్రిలో (NMCH) పని చేస్తున్న 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. కరోనా సోకిన వైద్యులకు లక్షణాలు తక్కువగా ఉన్నాయని, వారంతా ఆస్పత్రిలో క్యాంపస్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు పాట్నా డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. ఇటీవల కాలంలో పాట్నాలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యక్రమంలో అనేక మంది వైద్యులు పాల్గొన్నారు. ఇందులో నలందా మెడికల్ కాలేజీ వైద్యులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు, విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వీరందరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: భర్త ఇంట్లోకి రాగానే షాకింగ్ సీన్.. కుర్చీలో స్పృహ లేకుండా భార్య.. రెండు శవాలు !
బీహార్‌లో 352 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 87 మంది వైద్య విద్యార్థులు ఉన్నారు. కొత్త కేసుల నమోదులో అంతకు ముందు రోజుకంటే 71 కేసులు అధికంగా నమోదయ్యాయి. శని, శుక్రవారాల్లో బీహార్‌లో వరుసగా 281, 158 కొత్త కేసులు నమోదయ్యాయి . అయితే, గత నాలుగు రోజుల్లో కరోనా కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 7,27,529 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, కరోనా వైరస్ తో పోరాడుతూ 12,096 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, కరోనా వైరస్ కు సంబంధించి పూర్తి వాస్తవ విషయాలు వెల్లడించడం లేదని ప్రభుత్వంపై ఆరోపణలు వస్తున్నాయి. అధికారి లెక్కల కంటే రెండు నుంచి మూడు రెట్లు అధికంగా కరోనా కేసులు, మరణాలు నమోదయ్యి ఉంటాయని విశ్లేషకులు అంచనా వేశారు.
Also Read: coronavirus: దేశంలో భారీగా పెరిగిన కరోనా కొత్త కేసులు..
ఇదిలావుండగా, ప్రస్తుతం విద్యార్థులు అధికం కరోనా బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని జరవహర్ నవోదయ విద్యాలయంలో కూడా 85 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ప్రస్తుతం వారందరు కూడా ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇలా కరోనా సోకిన వారందరిని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఒక వైపు కరోనా కేసులు, మరో వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తుండటంతో ఆందోళన నెలకొంది. కాగా, దేశంలో గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 33,750 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా మహమ్మారి బారినపడ్డవారి సంఖ్య 3,49,22,882 కు చేరింది. నిన్నటితో పోలిస్తే.. 22 శాతం కొత్త కేసులు పెరిగాయి. యాక్టివ్ కేసులు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 1,45,582 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇదే సమయంలో కొత్తగా 10,846 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,42,95,407కు పెరిగింది.
Also Read: ఇద్దరు పురుషుల మధ్య ప్రేమ.. చివరికి.. !