మాల్దీవులకు ఏదైనా ఆపద వస్తే, సంక్షోభం ఎదురైతే భారతదేశమే మొదటగా స్పందిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధం అనేక రంగాల్లో శాంతికి కీలకం అని చెప్పారు. 

రక్షణ, భద్రత రంగాల్లో భారత్, మాల్దీవుల మధ్య సన్నిహిత సంబంధాలు శాంతికి ఎంతో కీలకమని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. హిందూ మహాసముద్రంలో దేశాంతర నేరాలు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముప్పు తీవ్రంగా ఉందని చెప్పారు. ‘‘ హిందూ మహాసముద్ర ప్రాంతంలో దేశాంతర నేరాలు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముప్పు తీవ్రంగా ఉంది. అందుకే రక్షణ, భద్రత రంగంలో భారత్, మాల్దీవుల మధ్య సమన్వయం ఎంతో అవసరం ’’ అని మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ తో చర్చల అనంతరం ప్రధాని మోడీ అన్నారు. 

WB SSC Scam : నాకు తెలియ‌కుండానే నా ఇంట్లోకి డ‌బ్బు వ‌చ్చింది - అర్పితా ముఖ‌ర్జీ

కోవిడ్ మహమ్మారి వల్ల సవాళ్లు ఎదురైనప్పటికీ, దేశాల మధ్య సహకారం విస్తృత భాగస్వామ్యంగా మారుతోందని ప్రధాని మోదీ అన్నారు. మాల్దీవులకు ఏదైనా అవసరం వచ్చినా లేదా సంక్షోభం ఎదుర్కొన్నా భారతదేశమే మొదటగా ప్రతిస్పందిస్తుందని, ఇది ఎప్పటికీ కొనసాగుతుందని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. భారతదేశం- మాల్దీవుల భాగస్వామ్యం రెండు దేశాల ప్రజల ప్రయోజనాలకు ప్రయోజనాలకు కృషి చేయడమే కాకుండా సుస్థిరతకు ఒక వనరుగా కూడా మారుతోందని ఆయన నొక్కిచెప్పారు.

ఐదేళ్ల‌లో 50 కేసుల ప‌రిష్కారానికి సాయం చేసిన డాగ్స్ స్క్వాడ్ మెంబ‌ర్ రాణా ఇక లేదు..

సోమవారం తన నాలుగు రోజుల భారత పర్యటనను ప్రారంభించిన సోలిహ్, ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి తాను, ప్రధాని మోడీ దృఢమైన నిబద్ధతను పునరుద్ఘాటించామని చెప్పారు. మాల్దీవులు-భారత్ సంబంధాలు దౌత్యానికి మించినవని అన్నారు. తమ దేశం భారతదేశానికి నిజమైన మిత్రదేశంగా మిగిలిపోతుందని ఆయన చెప్పారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సన్నిహిత బంధానికి నిదర్శనం అని మాల్దీవుల అధ్యక్షుడు ప్రధాని మోదీతో కలిసి ఒక సంయుక్త పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

Scroll to load tweet…

సైబర్ భద్రత సామర్థ్యం పెంపు, గృహ నిర్మాణం, విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనలో సహకారాన్ని సులభతరం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు మధ్య చర్చల అనంతరం భారత్, మాల్దీవులు ఆరు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. 

Scroll to load tweet…

కాగా.. న్యూఢిల్లీలో అధికారిక కార్యక్రమాలతో పాటు, వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొనడానికి సోలిహ్ ముంబైని కూడా సందర్శించనున్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో మాల్దీవులు భారతదేశ కీలక సముద్ర పొరుగుదేశాలలో ఒకటిగా ఉంది. భారతదేశ నైబర్ హుడ్ ఫస్ట్ పాలసీలో మాల్దీవులకు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. రక్షణ, భద్రతా రంగాలతో పాటు రెండు దేశాల మధ్య మొత్తం ద్వైపాక్షిక సంబంధాలు గత కొన్ని సంవత్సరాలలో వేగవంతమైన వృద్ధిని సాధించాయి.