Asianet News TeluguAsianet News Telugu

ఐదేళ్ల‌లో 50 కేసుల ప‌రిష్కారానికి సాయం చేసిన డాగ్స్ స్క్వాడ్ మెంబ‌ర్ రాణా ఇక లేదు..

వణ్యప్రాణుల నేరగాళ్లను గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన కర్ణాటక డాగ్ స్వ్కాడ్ మొదటి మెంబర్ రాణా అనారోగ్య కారణాల్లో చనిపోయింది. 2014 డాగ్ స్క్వాడ్ లో చేరిన రాణా..తన 13వ యేట కన్నుమూసింది. 

Dog Squad member Rana, who helped solve 50 cases in five years, is no more.
Author
Bangalore, First Published Aug 2, 2022, 1:28 PM IST

వన్యప్రాణుల నేరాగాళ్లను గుర్తించేందుకు రూపొందించిన కర్ణాటక డాగ్స్ స్క్వాడ్‌లో తొలి మెంబ‌ర్ రాణా ఇక లేదు. 13 ఏళ్ల జర్మన్ షెపర్డ్ మంగళవారం ఉదయం బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో కన్నుమూసింది. దీనిని బీటీఆర్ డైరెక్ట‌ర్ రమేష్ ధృవీక‌రించారు. మంగళవారం ఉదయం వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా రాణా చ‌నిపోయింద‌ని ఆయ‌న ‘టీఎన్ఐఈ’ కి తెలిపారు. ‘రాణా పదవి నుంచి రిటైర్డ్ అయినప్పటికీ, మాకు మారో డాగ్ దొరికినప్పటికీ.. రాణా స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు ’’ అని ఆయన అన్నారు.

కేరళలో ఐదో మంకీపాక్స్ కేసు.. దేశంలో మొత్తం ఎన్ని కేసులంటే?

2014లో డిపార్ట్‌మెంట్‌లో చేరిన రాణా... భోపాల్ లోని డాగ్ స్క్వాడ్ స్పెషల్ ఆర్మ్‌డ్ ఫోర్స్ 9వ బెటాలియన్ లో ట్రైనింగ్ తీసుకుంది. ఈ డాగ్ కేవలం గత ఐదేళ్లలో 50 కేసులకు సహాయం చేసింది. పులుల వేట కేసులను ఛేదించడంలో, ఆయుధాలను కనుగొనడంలో రానా మాస్టర్ గా నిలిచింది.

సోనియా, రాహుల్ విచారణ తర్వాత ఈడీ దూకుడు.. నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో సోదాలు

ఈ ఘ‌ట‌న తెలిసిన వెంట‌నే  డాగ్ స్క్వాడ్ ట్రైనర్ ప్రకాష్ హొన్నాకోర్ తీవ్ర షాక్ కు గుర‌య్యాడు. కర్ణాటక మొదటి డాగ్ స్క్వాడ్ లో రాణాకు ఆయ‌నే శిక్ష‌ణ ఇచ్చాడు. రాణాతో క‌లిసి ఉన్న మొదటి, చివరి వ్యక్తి ఆయ‌నే. ప్ర‌కాష్ రాణాను డాగ్ స్క్వాడ్‌లో చేర్చి భోపాల్‌లో శిక్షణ ఇచ్చారు. అత‌డి చివరి రెండేళ్ల సర్వీస్‌లో రాణాతోనే ఉన్నారు. వీరిద్ద‌రూ క‌లిసి దాదాపు 30 కేసులను పరిష్కరించారు.

కాగా ట్రాఫిక్‌కు చెందిన డాక్టర్ సాకేత్, వన్యప్రాణి నేరాలను పరిష్కరించే అత‌డి బృందం రాణాను అటవీ శాఖలో ప్రవేశపెట్టింది. రాణాకు గౌర‌వ వీడ్కోలు ఇవ్వాల‌ని అటవీశాఖ నిర్ణయించింది.

Follow Us:
Download App:
  • android
  • ios