Asianet News TeluguAsianet News Telugu

WB SSC Scam : నాకు తెలియ‌కుండానే నా ఇంట్లోకి డ‌బ్బు వ‌చ్చింది - అర్పితా ముఖ‌ర్జీ

తన ప్రమేయం లేకుండానే తన నివాసాల్లోకి డబ్బు వచ్చి చేరిందని బెంగాల్ లో టీచర్ రిక్రూట్ మెంట్ స్కామ్ లో ప్రమేయం ఉందని భావిస్తున్న అర్పితా ముఖర్జీ అన్నారు. వైద్య పరీక్షల కోసం ఆమె వాహనం దిగి వస్తున్నప్పుడు మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. 

WB SSC Scam : Money came into my house without my knowledge - Arpita Mukherjee
Author
Kolkata, First Published Aug 2, 2022, 2:19 PM IST

త‌న ఇంట్లోకి త‌న‌కు తెలియ‌కుండా డ‌బ్బు వ‌చ్చి చేరింద‌ని స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టు అయిన టీఎంసీ నాయ‌కుడు, మాజీ మంత్రి పార్థ ఛ‌ట‌ర్జీ స‌న్నిహితురాలు అర్పితా ముఖ‌ర్జీ అన్నారు. ఈడీ అధికారుల అదుపులో ఉన్న వారిద్ద‌రిని వైద్య పరీక్షల కోసం నగరంలోని దక్షిణ శివార్లలో ఉన్న ESI జోకాకు తీసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆమె అధికారుల వాహ‌నం దిగి న‌డుచుకుంటూ వ‌చ్చారు. అక్క‌డ వీరి కోసం వెయిట్ చేస్తున్న విలేక‌రుల‌తో ఆమె మాట్లాడారు.

ఐదేళ్ల‌లో 50 కేసుల ప‌రిష్కారానికి సాయం చేసిన డాగ్స్ స్క్వాడ్ మెంబ‌ర్ రాణా ఇక లేదు..

‘‘ నా ఇంట్లోకి నాకు తెలియకుండానే డబ్బు ఉంచారు.’’ అంటూ వేళ్లను పక్క వైపు వేళ్లను తిప్పింది. దీంతో ఆయ‌న ఎవ‌ర‌నే ఊహాగానాలు బ‌య‌లుదేరాయి. కాగా రెండు రోజుల కింద‌ట వైద్య ప‌రీక్ష‌ల కోసం వ‌చ్చిన పార్థ చ‌ట‌ర్జీ ఇలాగే మీడియాతో మాట్లాడుతూ.. ఆ డ‌బ్బు త‌న‌ది కాద‌ని అన్నారు. కావాల‌నే త‌నను కుట్ర పూరితంగా ఇరికించార‌ని చెప్పారు. తృణ‌ముల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయ‌న‌ను స‌స్పెండ్ చేయడం ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేశారు. త‌న‌పై కుట్ర చేసిన వారెవ‌రో త్వ‌ర‌లో కాల‌మే చెబుతుంద‌ని అన్నారు. 

కేరళలో ఐదో మంకీపాక్స్ కేసు.. దేశంలో మొత్తం ఎన్ని కేసులంటే?

కాగా.. వీరిద్దరి 10 రోజుల ED కస్టడీ ముగియడంతో వారిని బుధవారం పీఎంఎల్‌ఎ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఇదిలా ఉండ‌గా.. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ సిఫారసుల మేరకు నిర్వహించిన టీచర్ రిక్రూట్ మెంట్ తో పాటు, గ్రూప్-సీ, డీ సిబ్బంది నియామకాల్లో జరిగిన అవకతవకలపై కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ కుంభకోణంలో మనీ జాడపై ఈడీ ఆరా తీస్తోంది. అందులో భాగంగా ఆయ‌న‌ను ఇటీవ‌లే అరెస్టు చేసింది. అలాగే ఆయ‌న స‌న్నిహితుల ఇళ్ల‌లోనూ ఈడీ సోదాలు నిర్వ‌హించింది. ఛ‌ట‌ర్జీకి అత్యంత స‌న్నితుల్లో ఒక‌రైన అర్పితా ముఖర్జీకి చెందిన ఇళ్ల‌ల్లో ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ స‌మ‌యంలో ఆమె ఇంట్లో కోట్లాది రూపాయిల డ‌బ్బులు క‌నిపించాయి. న‌గ‌లు కూడా ల‌భించాయి. వీటిని చూసిన అధికారులు ఖంగుతిన్నారు. కుప్ప‌లు కుప్ప‌లుగా పోసి ఉన్న డ‌బ్బుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. త‌రువాత ఆమెను అరెస్టు చేశారు.ఈ కేసులో మొద‌టి నుంచి అర్పితా ముఖర్జీ పేరు వినిపిస్తోంది. అయితే ఆమె గురించి జనాలకు ఎవ‌రికీ పెద్ద‌గా తెలియదు. ఆమె మంత్రి పార్థ ముఖర్జీకి సన్నిహితురాలు. నటి, మోడల్ గా ఉన్న అర్పిత ఒడిశా చిత్ర పరిశ్రమలో నటించింది. ఆమె అనేక తమిళ చిత్రాలకు కూడా పనిచేసింది. మామా-భంగే, పార్టనర్ తో క‌లిసి బెంగాలీ చిత్రాలలో కూడా ఆమె న‌టించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios