Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్: మరుగునపడ్డ వాస్తవాలు, తప్పుదారి పట్టించిన కథనాలు

దేశంలో కరోనా కేసుల నేపథ్యంలో అపోహలు, అనుమానాలు తీర్చడంతో పాటు వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఎస్ గురుమూర్తి. 

Covid Missing facts misdirected discourse ksp
Author
New Delhi, First Published Apr 28, 2021, 9:28 PM IST

వ్యాసకర్త,
ఎస్. గురుమూర్తి
సీనియర్ పాత్రికేయులు

దేశంలో కరోనా కేసుల నేపథ్యంలో అపోహలు, అనుమానాలు తీర్చడంతో పాటు వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఎస్ గురుమూర్తి. 

‘‘ప్రస్తుతం భారత్‌లోని ఐదో వంతు జిల్లాల్లో గడిచిన వారం రోజులుగా కోవిడ్ కేసులు నమోదు కాలేదు. రెండు నెలల క్రితం ఫిబ్రవరి 15న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ ఈ మాట చెప్పారు. అప్పటికే రోజుకు 90,000 నమోదవుతున్న కేసులు 9,000కు పడిపోయాయి. కానీ ఏప్రిల్‌లో అనూహ్యమైన విపత్తుగా మారిపోయింది. దీనిని ఎదుర్కోవాల్సిందిగా కేంద్రం జాతికి పిలుపునిచ్చింది. 

కానీ ఢిల్లీలో ఆక్సిజన్ కొరత వల్ల దురదృష్టవశాత్తూ చోటు చేసుకున్న మరణాలు దేశాన్ని విషాదంలోకి నెట్టాయి. అయితే కొన్ని అవాస్తవ కథనాలు దేశాన్ని తప్పుదోవపట్టించాయి. అవి ఏవో ఒకసారి చూస్తే.. ఆక్సిజన్ కొరత వల్ల చోటు చేసుకున్న  మరణాలు ఢిల్లీ కార్పోరేట్ ఆసుపత్రుల్లో సంభవించాయి. ఈ ఆసుపత్రులు కోవిడ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ గతేడాది భారీ లాభాలను ఆర్జించాయి. కోవిడ్ 19 కాలంలో లాభం పేరుతో నేషనల్ హెరాల్డ్ ఒక వ్యాసం రాసింది. 

20.06.2020 నాటి నివేదిక ప్రకారం..“రూ .25,090, రూ .53,090, రూ .75,590, రూ .5,00,000, రూ .6,00,000, రూ .12,00,000 - ఇవి యాదృచ్ఛిక సంఖ్యలు కాదు. కోవిడ్ సోకితే ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్ కోసం ఒక రోజుకు అయ్యే ఖర్చుల వివరాలు ఇవి. ఇక వ్యక్తిగత రక్షణ పరికరాలు, పరీక్షలు, మెడిసిన్ బిల్లులను జోడిస్తే.. ఇది ఓ సగటు భారతీయ కుటుంబం యొక్క వార్షిక ఆదాయానికి సమానం. ఇంటిలో వుండి తీసుకునే చికిత్సకు అయ్యే ఖర్చు కూడా తక్కువేం కాదు. ఇది రోజుకు రూ.5,700 నుంచి రూ.21,900 వరకు వుంది. ఆసుపత్రుల దోపిడికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇండియా హెరాల్డ్ నివేదిక పేర్కొంది. 

అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్లు, ఫిక్కీ సభ్యులు స్వీయ నియంత్రణకు అంగీకరించారు. దీని ప్రకారం రోజువారీ రుసుము రూ.15,000, ఆక్సిజన్‌కు రూ.5,000, ఐసీయూకు రూ.25,000, వెంటిలేటర్లకు రూ.10,000. అయితే ఫిక్కీ రేట్లు ఇంకా ఎక్కువగా వున్నాయి. ఇక్కడ రోజుకు రూ.17,000 నుంచి రూ.45,000. ఆసుపత్రులు ఒక్కో పీపీఈ కిట్‌ను రూ.375 నుంచి రూ.500కు కొనుగోలు చేసి 10-12 రెట్లు ఎక్కువగా రోగులకు విక్రయించాయి. ఒక్క ఢిల్లీ మాత్రమే కాదు చెన్నై, ముంబైలలోనూ ఇదే పరిస్ధితి నెలకొంది. 

ఈ ఆసుపత్రులే ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన జీవన హక్కు ప్రకారం తమకు ప్రభుత్వాలు ఆక్సిజన్ సరఫరా కోసం రిట్లను దాఖలు చేశాయి. దీని కోసం వారు రోగుల నుంచి రోజుకు రూ.5,700 వసూలు చేస్తున్నాయి. ఆక్సిజన్ ఉత్పత్తి, వాణిజ్యం, నిల్వ, వినియోగం ప్రైవేటీకరించబడింది. మెడికల్ ఆక్సిజన్ వ్యాపారం భారత్‌లో నియంత్రించబడదు. అయినప్పటికీ దాని ధరలను నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) నియంత్రిస్తుంది.

ఇది కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు ఢిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో వున్నాయి. ఈశాన్య దేశంలోని పారిశ్రామిక మండలాల నుంచి సామాగ్రిని ట్రక్ చేయాలి. అయితే సకాలంలో డెలివరీలను నిర్థారించడానికి దీనికి ఖచ్చితమైన ముందస్తు ప్రణాళిక అవసరం. కానీ ఆసుపత్రుల నిరంతర అవసరాల కోసం స్టాక్‌ను ప్లాన్ చేయలేదు. 

రెండవది, దేశంలో ఆక్సిజన్ కొరత లేదు. సుదూర ప్రాంతాలలో కేంద్రీకృతమైన ద్రవ రూపంలో ఉన్న ఆక్సిజన్ భారీ, సురక్షితమైన ట్యాంకర్ల ద్వారా రవాణా చేయబడుతుంది. దీని ధర 45 లక్షల రూపాయలు. మహమ్మారి సమయంలో ఆక్సిజన్ సరఫరా గొలుసు ఒత్తిడిని భరించలేదు. ముఖ్యంగా మరణాలు అధికంగా జరుగుతున్న ఢిల్లీ.. ఆక్సిజన్ రవాణా చేయాల్సిన ప్రదేశానికి అనేక వందల కిలోమీటర్ల దూరంలో ఉండటం ఇబ్బంది పెడుతోంది. 

ఊహించని ఈ సునామీ నుంచి ఎదుర్కోవటానికి దేశానికి పిలుపునిచ్చింది. కోవిడ్ వంటి జాతీయ విపత్తు నేపథ్యంలో కూడా సమిష్టి సంకల్పం లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. ప్రతిపక్ష పార్టీలు ఇదే సమయంలో టీకాను ఎలా బ్రాండ్ చేశాయో గుర్తించవచ్చు. అత్యవసర ఉపయోగం కోసం ప్రభుత్వం ఆమోదించిన కోవాక్సిన్ విషయంలో ఈ విషయం బహిర్గతమైంది. కోవాక్సిన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు రణదీప్ సింగ్ సుర్జేవాలా, శశి థరూర్, మనీష్ తివారీ, జైరామ్ రమేష్ కోరస్ చేశారు. ఈ వ్యాక్సిన్ ప్రమాదకరమని ఆనంద్ శర్మ వంటి వారు వ్యాఖ్యానించారు.

రాజస్థాన్ మినహా, కాంగ్రెస్ పాలిత పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కేరళతో పాటు పశ్చిమ బెంగాల్ , జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో టీకాల గురించి ప్రజల మనస్సులో సందేహాలను సృష్టించాయి. ఫలితంగా ప్రజలు టీకా తీసుకోవడానికి సంశయించారు. జనవరిలో కేవలం 33% లబ్ధిదారులు షాట్ కోసం సిద్ధంగా ఉండగా.. 40% మంది వెయిట్ చేయడానికి ఇష్టపడ్డారు. వీరిలో 16% మంది మాత్రం వ్యాక్సిన్‌ తీసుకునేందుకు సిద్ధం లేరు. ఇదే సమయంలో మార్చిలో వ్యాక్సిన్ తీసుకునేందుకు సిద్ధంగా వున్న వారు 57% కి పెరిగారు. సగం మంది వేచి ఉండటానికి ఇష్టపడేవారు 6 శాతానికి తగ్గారు. 

(ఈ వ్యాసం 27.04.2021న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో ప్రచురితమైంది)

Follow Us:
Download App:
  • android
  • ios