Asianet News TeluguAsianet News Telugu

పిల్ల‌ల్లో Bharat Biotech Covaxin మెరుగైన ఫలితాలు

Bharat Biotech: ఇప్పటికే కరోనాపై యుద్ధానికి వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.  ఇప్పటికే అర్హులైనవారికి రెండు డోసుల వ్యాక్సిన్ కూడా పూర్తయింది. తాజా భార‌త్ బ‌యోటెక్ మ‌రో కీల‌క అడుగు వేసింది. 2-18 ఏళ్ల పిల్ల‌ల మీద నిర్వ‌హించిన ట్రయల్స్‌ ఫలితాలు చాలా మెరుగ్గా ఉన్నాయ‌నీ, ఉత్తమ ఫలితాలు వ‌చ్చాయని తెలింది. భారత్‌ బయోటెక్‌పిల్లల్లో 1.7 రెట్లు ఎక్కువగా యాంటీబాడీల ఉత్పత్తి అవుతున్నాయని తెలిపింది భార‌త్ బ‌యోటెక్.

Covaxin found to be safe, well-tolerated and immunogenic in 2-18 age group: Bharat Biotech
Author
Hyderabad, First Published Dec 30, 2021, 7:21 PM IST

Bharat Biotech: ప్ర‌పంచ‌దేశాల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది క‌రోనా కొత్త వేరియంట్. ద‌క్షిణాఫ్రికాలో వెలుగులోకి వ‌చ్చిన ఈ వేరియంట్ వారాల వ్య‌వ‌ధిలోనే ప్ర‌పంచ దేశాలకు వ్యాపించింది. ఈ వేరియంట్ మ‌న దేశంలో అడుగుపెట్టి.. విజృంభిస్తూ కలవరపెడుతోంది. కరోనాపై యుద్ధానికి ఇప్పటికే వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.  ఇప్పటికే అర్హులైనవారికి రెండు డోసుల వ్యాక్సిన్ కూడా పూర్తయింది. 
 

ఈ క్ర‌మంలో భారత వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భారత్‌ బయోటెక్‌ కంపెనీ మరో కీలక అడుగు వేసింది. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్నవారికే వ్యాక్సినేషన్‌ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.  తాజా భార‌త్ బయోటెక్ 2 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్నవారిపై టీకా క్లినికల్‌ ట్రయల్స్ నిర్వ‌హించింది. ఈ ట్ర‌య‌ల్స్ లో మెరుగైన ఫ‌లితాలు వ‌చ్చాయ‌నీ, పిల్లల్లో 1.7 రెట్లు ఎక్కువగా యాంటీబాడీల ఉత్పత్తి అయ్యాయని ప్ర‌క‌టించింది. అలాగే..  భారత్‌ బయోటెక్ పిల్లల్లో  ఎలాంటి దుష్పరిణామాలు చూపట్లేదని భారత్‌ బయోటెక్ ప్ర‌క‌టించింది. ఇమ్యునోజెనిక్‌గా నిరూపించబడిందని ప్రకటించింది. 2-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, యుక్తవయస్కులలో కోవాక్సిన్ ఫ‌లితాలు బాగున్నాయ‌నీ, వారిలో ఇమ్యునోజెనిసిటీని అంచనా వేయడానికి ప్ర‌యోగించ‌మని భార‌త్ బ‌యోటెక్ తెలిపింది.  

Read Also: ఉడుత ఉగ్రరూపం.. రెండు రోజుల్లో 18 మందిపై దాడి.. సోషల్ మీడియాలో బోరుమన్న నెటిజన్లు

 ఈ సంద‌ర్బంగా  భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్  కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. పిల్ల‌ల్లో వ్యాక్సిన్ ప‌నితీరు చాలా బాగుంద‌ని , కోవాక్సిన్స్ క్లినికల్ ట్రయల్ డేటా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయ‌ని తెలిపారు. ఫార్మాస్యూటికల్ సంస్థ భారత్ బయోటెక్..  తన కోవిడ్-19 వ్యాక్సిన్ ప్ర‌యోగాల కోసం నిర్వ‌హించిన ప్ర‌యోగాల్లో ..  2-18 సంవత్సరాల వయస్సులో సురక్షితమైనదని, వాక్సిన్ ను వారు తట్టుకోగలరని తెలిపారు. అలాగే.. శ‌రీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరిగిన‌ట్టు గ‌మ‌నించ‌మ‌ని తెలిపారు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బిబిఐఎల్) క్లినికల్ ట్రయల్ డేటా చాలా ప్రోత్సాహకరంగా ఉందని పేర్కొంది.

Read Also: ఎక్కడ ఐటీ దాడులు జరిగినా.. పట్టుబడే సొమ్ము ఏపీ మంత్రులదే కావడం సిగ్గు చేటు: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు

 
2-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలపై అనేక సార్లు ప‌రీక్ష‌లు నిర్వహించిన‌ట్టు తెలిపారు.   కౌమారదశలో ఉన్న పిల్ల‌ల్లో కోవాక్సిన్ మెరుగ‌ప‌నిచేస్తుంద‌ని అన్నారు.  జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య పీడియాట్రిక్ సబ్జెక్టులలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు. ఈ ట్ర‌య‌ల్స్ లో  రియాక్టోజెనిసిటీ, ఇమ్యునోజెనిసిటీని ప్రదర్శించాయని  పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios