ఉడుత ఉగ్రరూపం.. రెండు రోజుల్లో 18 మందిపై దాడి.. సోషల్ మీడియాలో బోరుమన్న నెటిజన్లు

యూకేలోని వేల్స్‌లో ఉడుత ఉగ్రరూపం చూపింది. రెండు నెలల్లో 18 మందిపై దాడి చేసింది. ఉన్నట్టుండి ఆ ఉడత అసాధారణంగా ప్రవర్తించింది. ఎదురు వచ్చిన ప్రతి వ్యక్తిపై దాడి చేసింది. కాళ్లు, చేతులు అనే తేడా లేకుండా అందిన కాడికి దాడి చేసింది. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. ఈ గాయాలను సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టు చేశారు.
 

squirrel attack 18 people in UK

న్యూఢిల్లీ: ఉడుత(Squirrel) అనగానే సాధు జంతువుగా అందరికీ గుర్తుకు వస్తుంది. దాని పనిలో అది బిజీగా ఉండటం చూస్తుంటాం. పొదల్లో నుంచి బయటకు రావడం.. పని ముగించుకుని మళ్లీ పొలోమని పారిపోవడం చేస్తుంటుంది. మనుషులకు దగ్గరగా మెదలడం అరుదు. అలాంటి ఓ ఉడుత యునైటెడ్ కింగ్‌డమ్‌(UK)లోని వేల్స్ దేశంలో ఉగ్రరూపం చూపింది. ఒక్కొక్కరిని వేటాడి మరీ దాడి చేసింది. ఎదుటి వారు ఏ విధంగానూ రెచ్చగొట్టకున్నా.. ఉడుత దాడి చేసింది. రెండు రోజుల పాటు ఉత్తర వేల్స్‌(North Wales)లో బీభత్సం సృష్టించింది. కనీసం 18 మందిపై దాడి చేసింది. ఉడుత దాడి(Attack)కి గురైన చాలా మంది తమ ఆవేదనను సోషల్ మీడియాలో వ్యక్తం చేసుకున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండండని, ఈ చుట్టు పక్కల ఓ ఉడుత తిరుగాడుతున్నదని వారు హెచ్చరికలు జారీ చేశారు.

ఓ నెటిజన్ ఫేస్‌బుక్‌లో ఈ దాడుల గురించి పోస్టు చేశారు. వార్నింగ్.. అని పెట్టి.. విషపూరిత ఉడుత దాడి చేస్తున్నదని పేర్కొన్నారు. ఆ ఉడత తనను, తన ఫ్రెండ్‌నూ దాడి చేసిందని వివరించారు. తమతో పాటు ఇతరులను చాలా మందిని ఆ ఉడుత దాడి చేసిందని పేర్కొన్నారు. కాబట్టి.. ఇంటి బయట అడుగుపెడితే జాగ్రత్త వహించండని తెలిపారు.

Also Read: కోతులు, కుక్కల మధ్య గ్యాంగ్ వార్.. పిల్ల కోతిని కుక్క చంపడంతో ప్రతీకారం.. 250 కుక్కలను చంపిన వానరులు

గ్రెమ్లిన్ సినిమాలో విలన్ పేరును ఈ ఉడుతకు పెట్టారు. స్ట్రైప్ అనే పేరుతో ఆ ఉడుతను వ్యవహరిస్తున్నారు. నిజంగానే ఆ ఉడత విలన్‌లా ప్రవర్తిస్తున్నదని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. ఆ ఉడుత (స్ట్రైప్) ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రజలపై దాడికి పూనుకుంది. చాలా మంది కాళ్లను, చేతులను, ఎక్కడ పడితే అక్కడే కొరికింది. కొందరైతే.. బ్యాక్టీరియా ఫామ్ కాకుండా టెటానస్ వ్యాక్సిన్ కూడా వేసుకోవాల్సి వచ్చింది.

అయితే, 65 ఏళ్ల కొరిన్ రెనాల్డ్స్ ఈ బీభత్సానికి ఫుల్ స్టాప్ పెట్టింది. రెనాల్డ్స్‌ను కూడా ఈ ఉడుత కొరికింది. ఉడుత అసాధారణ ప్రవర్తన తనకు ఆందోళన కలిగించిందని ఆమె వివరించారు. ఈ ఉడుత గురించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడానికి ప్రయత్నించింది. కానీ, అది సాధ్యపడలేదు. దీంతో ఆమెనే యాక్షన్ తీసుకున్నారు. ఆ ఉడుతను అడవిలోకి వదిలిపెట్టడం అక్కడ చట్ట విరుద్ధం. దీంతో ఆ ఉడుతకు మత్తు మందు ఇచ్చి సున్నితంగా చంపేయాలని నిర్ణయించుకున్నారు. తనకు రెండేళ్ల మనవడు ఉన్నాడని, ఆయన గార్డెన్‌లో ఆడుకుంటాడని ఆమె పేర్కొన్నారు. కానీ, ఉడుతతో ఆయనకూ ఎంతో ప్రమాదం ఉన్నదని ఆందోళన చెందానని, కాబట్టి, చంపేయాలనే నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

Also Read: నన్నే తరుముతావా? నీ అంతు చూస్తా..! అతనిపై రివేంజ్ తీసుకున్న కోతి.. 22 కిమీలు ప్రయాణించి మరీ..

యుద్ధాలు, గ్యాంగ్ వార్‌లు కేవలం మానవ జాతిలోనే కాదు.. జంతువుల్లోనూ ఉంటాయని ఈ వానరులు వెల్లడి చేశాయి. ఓ చిన్న కోతి పిల్లను ఓ కుక్క చంపేసిన ఘటనకు ప్రతీకారంగా(Revenge) కోతులన్నీ(Monkeys) ఏకం అయ్యాయి. పథకం ప్రకారం.. ఒక్కో కుక్క(Dog)ను ఏరేశాయి. గడిచిన నెల రోజుల్లో సుమారు 250 కుక్కలను చంపేశాయి(KIlled). చంపాలనుకున్న కుక్కను వేటాడటం.. దాన్ని చెట్టుపైకి లేదా భవంతిపైకి మోసుకెళ్లి.. అక్కడి నుంచి కిందకు విసిరేసే పద్ధతిని అవి అవంలభించాయి. ఇప్పుడు ఆ ఊరిలో చూడటానికి కుక్కలు కనిపించడమే లేవు. ఈ ఘటన Maharashtraలోని భీడ్‌లో చోటుచేసుకుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios