Coronavirus: తగ్గిన కరోనా కొత్త కేసులు.. పెరిగిన మరణాలు
Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, కోవిడ్-19 కేసులు క్రమంగా తగ్గుతుండటం అనుకూలించే అంశం. కానీ, మరణాలు మాత్రం క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్త కేసులు నమోదులో తగ్గుదల చోటుచేసుకోగా, మరణాలు మాత్రం పెరిగాయి.
Coronavirus: దేశంలో కొత్తగా నమోదైన కరోనా వైరస్ కేసుల్లో భారీగా తగ్గుదల నమోదైంది. ఇదే సమయంలో వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వైరస్ వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 7992 కరోనా కేసులు (Corona cases) నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 6 శాతం తక్కువగా కొత్త కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుత కేసులతో కలుపుకుని దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసులు 3,46,82,736కు పెరిగాయి. ఇదే సమయంలో కొత్తగా 9,265 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. దీంతో కరోనా నుంచి కొలుకున్న వారి సంఖ్య మొత్తం 3,41,14,331కు చేరింది. దేశంలో కోవిడ్-19 యాక్టివ్ కేసులు సైతం లక్ష దిగువన ఉన్నాయి. ప్రస్తుతం 93,277 క్రియాశీల కేసులు ఉన్నాయి. గత 559 రోజుల్లో యాక్టివ్ కేసులు ఇంత తక్కువకు చేరుకోవడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read: UP assembly elections 2022: యూపీ ఎన్నికల్లో 350కిపైగా సీట్లు గెలుస్తాం: యూపీ సీఎం యోగి
అలాగే, గత 24 గంటల్లో కరోనా వైరస్ తో మరణించిన వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా వైరస్‌తో పోరాడుతూ 393 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా వైరస్ కారణంగ చనిపోయిన వారి సంఖ్య 4,75,128 పెరిగింది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్త కేసులు వెగులుచూడటంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు పైగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కరోనా వైరస్ కట్టడి కోసం చర్యలను మరింత ముమ్మరం చేశాయి. దీనిలో భాగంగా కోవిడ్-19 పరీక్షలతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 65,32,43,539 కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 12,93,412 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. దేశంలో మొత్తం 132 కోట్ల కరోనా వైరస్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. ఇందులో మొదటి డోసు తీసుకున్నవారు 81.2 కోట్ల మంది ఉన్నారు. 50.8 కోట్ల మంది రెండు డోసులు తీసుకున్నారు.
Also Read: UNICEF Report : కరోనా పంజాతో.. 75 ఏండ్ల ప్రగతికి ముప్పు !
దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ వారంతపు పాజిటివిటీరేటు 5.3 శాతంగా ఉంది. రికవరీ రేటు సైతం క్రమంగా పెరుగుతోంది. రికవరీ రేటు 98.4 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.37 శాతానికి తగ్గింది. దేశంలో కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ లు టాప్-10లో ఉన్నాయి. కొత్తగా నమోదైన కరోనా మరణాల్లో అధికం కేరళలో నమోదయ్యాయి.
Also Read: UP: చేతిలో బిడ్డ ఉన్నా.. కనికరం లేకుండా కొట్టిన పోలీసు..