Asianet News TeluguAsianet News Telugu

UP assembly election 2022: యూపీ ఎన్నికల్లో 350కిపైగా సీట్లు గెలుస్తాం: యూపీ సీఎం యోగి

UP assembly elections 2022:  వచ్చే ఏడాది (2022) ప్రారంభంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్ని ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేప‌థ్యంలోనే అధికార పార్టీ బీజేపీ నేత‌, రాష్ట్ర సీఎం యోగి ఆధిత్య‌నాథ్ మాట్లాడుతూ..  జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో త‌మ‌దే విజ‌యమ‌నీ, ప‌క్క‌గా 350కి పైగా స్థానాలు గెలుచుకుంటామ‌నీ ధీమా వ్య‌క్తం చేశారు. 
 

BJP Will Cross 350 Seats in UP.. Says Yogi Adityanath
Author
Hyderabad, First Published Dec 11, 2021, 10:01 AM IST

UP assembly elections 2022: వచ్చే ఏడాది (2022) ప్రారంభంలో పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలన్ని ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఆయా పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలతో రాజకీయ హాటును పెంచారు. 2022లో ఉత్తరప్రదేశ్ లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎన్నికల ప్రచారంలో వేగం పెంచడంతో పాటు సరికొత్త పథకాలు, హామీలతో దూసుకుపోతున్నారు. మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను సైతం విడుదల చేశారు. ఏస్పీ, బీఎస్పీలు సైతం అధికార పీఠం దక్కించుకోవాలని ప్రచారపర్వం కొనసాగిస్తున్నాయి. అయితే, త్వరలో  జరగబోయే ఎన్నికల్లోనూ విజయం తమదేనని అధికార బీజేపీ చెబుతోంది. రాష్ట్రంలో 350కి పైగా సీట్లు గెలుచుకుంటానీ, మళ్లీ రాష్ట్రంలో బీజేపీ అధికారం దక్కించుకుంటుందని బీజేపీ నేత, రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: UNICEF Report : కరోనా పంజాతో.. 75 ఏండ్ల ప్రగతికి ముప్పు !

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ జాతీయ న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మళ్లీ బీజేపీనే అధికారం చేపడుతుందని అన్నారు.  పక్కగా బీజేపీ 350 పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు తమపై ఉన్న నమ్మకమే మళ్లీ తమను అధికారంలో కూర్చోబెడుతుందని చెప్పారు.  2017 ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్ కళ్యాణ్ సంకల్ప్ పత్రంలో (బీజేపీ మేనిఫెస్టో)  ఇచ్చిన హామీలన్నీ తమ ప్రభుత్వం నెరవేర్చిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు బీజేపీ వెంటే ఉన్నారని తెలిపారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గానూ 350కిపైగా సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల కోసం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.  ఎన్నికల ప్రచారంలో బీజేపీ పై విమర్శలతో విరుచుకుపడుతున్న ప్రతిపక్ష నాయకులు ప్రియాంక గాంధీ, అశిలేష్ యాదవ్ లపైనా యోగి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్ వాదీ పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తున్నది అన్నారు. అఖిలేష్ యాదవ్ తో పాటు  ఆ పార్టీ నేతలు అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 

Also Read: UP: చేతిలో బిడ్డ ఉన్నా.. క‌నిక‌రం లేకుండా కొట్టిన పోలీసు..

కాంగ్రెస్ పార్టీపైనా యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు.  కాంగ్రెస్ నాయకురాలు  ప్రియాంక గాంధీ వాద్రా 'ఎలక్షన్ టూరిజం'.. కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం సాయం చేయలేదని ఎద్దేవా చేశారు. UP assembly elections 2022 లో  కాంగ్రెస్ ఏ మాత్రం తమపై ప్రభావం చూపదని అన్నారు.  ఇంతకు ముందు ఎన్నికల జరుగుతున్నప్పటి పరిస్థితులను సైతం ఆయన ప్రస్తావించారు. 2017కు ముందు ఉత్తరప్రదేశ్‍ను బీమారు రాష్ట్రంగా అనేవారనీ , ప్రస్తుతం అభివృద్ధికి చిరునామాగా చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టడంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన అభివృద్ధి పనులే  తమకు మళ్లీ అధికారం కట్టబెడుతాయని అన్నారు.  భారత్ ప్రపంచంలో ఆర్థింకగా ఒక సూపర్ పవర్ ఎదగడంలో ఉత్తరప్రదేశ్ కీలకంగా మారుతోదని అన్నారు. ఒసీనియన్ పోల్స్ సైతం మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని వెల్లడించిన అంశాలను సైతం ఆయన గుర్తుచేశారు. 

Also Read: Beti Bachao Beti Padhao Scheme: పథకం నిధులన్ని ప్రకటనలకే ఖర్చు !

Follow Us:
Download App:
  • android
  • ios