UNICEF Report : కరోనా పంజాతో.. 75 ఏండ్ల ప్రగతికి ముప్పు !
UNICEF Report : గతేడాది వెగులుచూసిన కరోనా వైరస్.. తక్కువ కాలంలోనే యావత్ ప్రపంచాన్ని చుట్టిముట్టింది. ఈ మహమ్మారి సృష్టించిన సంక్షోభం అంతాఇంతా కాదు. ఇప్పటికే అనేక రంగాలను కొలుకోని దెబ్బతీసింది. మానవ మనుగడకే సవాలు విసిరింది. ఈ మహమ్మారి ప్రభావం చిన్నారులపై పెను ప్రభావాన్ని చూపింది. కరోనా కారణంగా 10 కోట్ల మందికి పైగా చిన్నారులు పేదరికంలోకి జారుకున్నారని United Nations International Children ‘s Emergency Fund (యూనిసెఫ్) నివేదిక పేర్కొంది.
UNICEF Report : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ సృష్టించిన ఆర్థిక, ఆరోగ్య సంక్షోభం ఏ స్థాయిలో కొనసాగుతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, చిన్నారులపై కరోనా వర్ణించలేని స్థాయిలో ప్రభావం చూపుతున్నదని United Nations International Children ‘s Emergency Fund (యూనిసెఫ్) నివేదిక పేర్కొంది. మరీ ముఖ్యంగా గత 75 సంవత్సరాల్లో చిన్నారుల విషయంలో సాధించిన ప్రగతికి కరోనా నుంచి ముప్పు ఏర్పడిందని UNICEF Report పేర్కొంది. కోట్లాది మందిని ఆర్థిక, ఆరోగ్య సంక్షోభంలోకి నెట్టిన కరోనా మహమ్మారి.. 10 కోట్ల మందికి పైగా చిన్నారులను పేదరికంలోకి నెట్టివేసిందని ఈ నివేదిక పేర్కొంది. 2019 తో పోలిస్తే పేదరికంలోకి జారుకున్న చిన్నారుల సంఖ్యలో 10 శాతం పెరుగుదల చోటుచేసుకుంది. కరోనా విజృంభణ మొదలైన గతేడాది మార్చి నుంచి పేదరికంలోకి జారుకుంటున్న చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అప్పటి నుంచి ప్రతిరోజు సెకనుకు ఇద్దరు చిన్నారులు పేదరికంలోకి జారుకున్నారు.
Also Read: UP: చేతిలో బిడ్డ ఉన్నా.. కనికరం లేకుండా కొట్టిన పోలీసు..
చిన్నారుల కోసం ప్రారంభమైన United Nations International Children ‘s Emergency Fund ఏర్పాటై ఈ ఏడాది డిసెంబర్ 11 నాటికి 75 సంవత్సారాలు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే "చిన్నారులపై కరోనా వైరస్ ప్రభావం" అనే పేరుతో యూనిసెఫ్ ఓ నివేదికను విడుదల చేసింది. పై అంశాలను ఈ నివేదికలోనే ప్రస్తావించింది. UNICEF Report ప్రస్తావించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి... కరోనా కారణంగా గత 75 సంవత్సరాల్లో పిల్లల విషయంలో సాధించిన పురోగతికి ముప్పు ఏర్పడింది. పేదరికంలోకి చిన్నారులను నెట్టివేసింది. 10 కోట్ల మందికి పైగా చిన్నారులు పేదరికంలోకి జారుకోగా.. కరోనా అనంతరం 10 శాతం పెరుగుదల నమోదైంది. కోవిడ్-19 నుంచి ఏర్పడిన పరిస్థితులు మెరుగుపడటానికి దాదాపు 8 ఏండ్లు పడుతుందని తెలిపింది. అయితే, ఇది మున్ముందు కరోనా చూపే ప్రభావం మీద ఆధారపడి ఉంటుందని పేర్కొంది. కరోనా కారణంగా లాక్‌డౌన్ సమయంలో పంచవ్యాప్తంగా 80 శాతానికి పైగా బడులు మూతపడ్డాయి. దాదాపు 160 కోట్ల మంది విద్యార్థుల చదువులకు దూరం అయ్యారు.
Also Read: Beti Bachao Beti Padhao Scheme: పథకం నిధులన్ని ప్రకటనలకే ఖర్చు !
కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం కారణంగా బాల్య వివాహాలు సైతం పెరిగే అవకాశముందని UNICEF Report పేర్కొంది. ఈ దశాబ్దం ముగిసే సుమారు కోటి మంది చిన్నారులకు బలవంతపు బాల్యవివాహాలు జరిగే అవకాశముందని అంచనా వేసింది. చిన్నారుల మానసిక ఆరోగ్యంపైనా కోవిడ్-19 తీవ్ర ప్రభావం చూపిందని నివేదిక పేర్కొంది. వారిలో 13 శాతం మంది 10-19 ఏండ్ల మధ్యవారు ఉన్నారు. కరోనా కారణంగా 93 శాతానికి పైగా ఆరోగ్య సేవలు అందుబాటులో లేకుండా పోయాయని తెలిపింది. బాలకార్మికులు సైతం భారీగా పెరిగారు. గత 4 ఏండ్లలో 84 లక్షల మంది చిన్నారులు కార్మికులుగా మారారు. ఇక వచ్చే ఏడాడి (2022) నాటికి మరో 90 లక్షల మంది ఈ కూపంలోకి జారుకునే అవకాశాలున్నాయని United Nations International Children ‘s Emergency Fund నివేదిక పేర్కొంది. పోషకాహార లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య ఐదు కోట్లకు చేరగా, వచ్చే ఏడాది చివరి నాటికి మరో 90 లక్షల మంది పోషకాహార లోపంతో బాధపడుతారని అంచనా వేసింది. United Nations International Children ‘s Emergency Fund ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోర్ మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో చిన్నారుల్లో ఆకలి, నిరక్షరాస్యత, వేధింపులు, పేదరికం, బలవంతపు బాల్యవివాహాలు పెరుగుతున్నాయని అన్నారు.
Also Read: Weather Updates: ఏపీ, తెలంగాణకు మరోసారి వర్షాలు… వాతావరణ కేంద్రం హెచ్చరికలు