Asianet News TeluguAsianet News Telugu

UP: చేతిలో బిడ్డ ఉన్నా.. క‌నిక‌రం లేకుండా కొట్టిన పోలీసు..

 UP: ప్ర‌భుత్వాలు ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థలు అంటూ చెబుతున్నాయి. కానీ  ప‌లువురు పోలీసుల్లో మార్పులు రావ‌డం లేదు.  అన్యాయంగా సామాన్యులపై  లాఠీ ఝుళిపించిన ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి. ఇదే త‌ర‌హాలో చేతిలో బిడ్డ‌ను ఎత్తుకుని ఉన్న ఓ వ్య‌క్తిపై ఓ ఎస్సై  క‌నిక‌రం లేకుండా లాఠీతో కొట్టాడు. యూపీలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 

Cop Thrashes Man With Child In Arms, Suspended For "Insensitivity"
Author
Hyderabad, First Published Dec 10, 2021, 3:16 PM IST

UP: పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున ఘటనలు ఇటీవ‌లి కాలంలో  ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అన్యాయంగా సామాన్యుల‌పై ప‌లువురు పోలీసులు దాడుల‌కు.. దౌర్జన్యానికి దిగిన ఘ‌ట‌న‌లు అనేకం. ఇదే నేప‌థ్యంలో చంటిబిడ్డ‌ను ఎత్తుకుని ఉన్న ఓ వ్య‌క్తిపై ఏమాత్రం క‌నిక‌రం లేకుండా దాడి చేశాడు ఓ ఎస్సై.  ఈ ఘ‌ట‌న‌లో భ‌యాందోళ‌న‌కు గురై బిడ్డ ఏడుస్తున్న క‌నిక‌రం చూప‌లేదు ఆ ఖాకీ. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. పోలీసుల తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

Also Read: Beti Bachao Beti Padhao Scheme: పథకం నిధులన్ని ప్రకటనలకే ఖర్చు !

 

ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.  రాష్ట్రంలోని కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఓ ఆస్ప‌త్రిలో ఓపీడీ సేవలకు ఆటంకం కలిగిస్తున్నాడని ఆరోపిస్తూ చిన్నారిని తీసుకెళ్తున్న వ్యక్తిని పోలీసు తీవ్రంగా కొట్టాడు. తాను ఎత్తుకున్న బిడ్డ ఏడుస్తున్న క‌నిక‌రించ‌కుండా లాఠీతో దాడి చేశాడు ఆ పోలీసు.  దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ నేత‌, పార్ల‌మెంట్ స‌భ్యులు వరుణ్‌ గాంధీ స‌హా  పలువురు నేతలు సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైర‌ల్ గా మారి పోలీసు ఉన్న‌తాధికారుల వ‌ద్ద‌కు చేరింది.  స‌ద‌రు వ్య‌క్తిపై దాడి చేసిన ఎస్సైని  సస్పెండ్‌ చేస్తున్న‌ట్టు అధికారులు తెలిపారు. ఈ వీడియోను చాలా మంది నేత‌లు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ రాష్ట్ర ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాధ్ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఖాకీల రాజ్యం కొన‌సాగిస్తున్నార‌ని ఆరోపించారు. దీనిపై బీజేపీ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ..  సాధారణ ప్రజలను హింసించడం ఎంట‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.  బలహీనులకు న్యాయం జరగాలంటే.. పటిష్టమైన పోలీసు వ్యవస్థ ఉండాలని వరుణ్‌ గాంధీ సూచించారు. న్యాయం పొందాల్సిన వారు ఈ అనాగ‌రిక‌మైన చ‌ర్య‌కు గురికావ‌డం బాధ‌క‌రం అని పేర్కొన్నారు. 

Also Read: Coronavirus: దేశంలో కొత్తగా ఎన్ని కరోనా మరణాలు నమోదయ్యాయంటే?

 ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో క్లిప్ ఒక నిముషం పాటు ఉంది. అందులో బిడ్డ‌ను ఎత్తుకున్న వ్య‌క్తిపై పోలీసులు లాఠీతో కొట్ట‌డం క‌నిపించింది. ఆ చిన్నారి తీవ్రంగా ఏడుస్తుంటే ఒక పోలీసు కొట్ట‌డం, మ‌రొక‌రు బిడ్డ‌ను లాక్కొవ‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. త‌న చేతిలో బిడ్డ ఉంద‌ని చెప్తున్న‌ప్ప‌టీకీ.. పోలీసులు కొట్ట‌డం ఆప‌లేదు. సంబంధిత విష‌యంలో ఆ వ్య‌క్తి త‌ప్పు ఉన్న‌ప్ప‌టికీ పోలీసులు ఇలాంటి అనాగ‌రిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌టం ఏంటి? అంటూ స‌ర్వత్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. ఏడుస్తున్న బిడ్డ‌ను, బాధితుడిని పోలీసులు కారు ఎక్కించేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే.. సార్ బిడ్డ‌కు తల్లి లేదని.. వదిలిపెట్టాలని ప్రాధేయ‌ప‌డ‌టం క‌నిపించింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌తో పాటు యూపీ స‌ర్కారుపై ఆగ్ర‌హం వ్యక్తంమ‌వుతోంది. నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు.  ఇక తెలంగాణలోని మహబూబాబాద్‌  లోనూ ఇటీవల ఓ హెల్మెంట్ ధరించలేదని కారణం చూపుతూ ో వ్యక్తి కొట్టారు. తనను అన్యాయంగా కొట్టారనీ, సదరు వ్యక్తి నిరసనకు సైతం దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సైతం వైరల్ మారిన సంగతి తెలిసిందే.

Also Read: Weather Updates: ఏపీ, తెలంగాణకు మరోసారి వర్షాలు… వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చరిక‌లు

 

 

Follow Us:
Download App:
  • android
  • ios