Asianet News TeluguAsianet News Telugu

రాజ్యాంగ పరిరక్షణ కోసం భావసారూప్యత కలిగిన పార్టీలతో కాంగ్రెస్ చేతులు కలుపుతుంది - సోనియా గాంధీ

భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు భావసారూప్యత కలిగిన పార్టీలతో కాంగ్రెస్ చేతులు కలుపుతుందని ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. రాబోయే కొన్ని నెలలు భారత ప్రజాస్వామ్యానికి కీలకమైన పరీక్ష అని తెలిపారు. 

Congress joins hands with like-minded parties to protect Constitution - Sonia Gandhi..ISR
Author
First Published Apr 11, 2023, 2:35 PM IST

నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. చట్టసభలు, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలను క్రమపద్ధతిలో నిర్వీర్యం చేస్తోందని అన్నారు. ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్యం పట్ల లోతైన నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమె 'ది హిందూ'కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. పలు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమ పార్టీ సందేశాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్తుందని అందులో తెలిపారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు భావసారూప్యత కలిగిన అన్ని పార్టీలతో కాంగ్రెస్ చేతులు కలుపుతుందని తెలిపారు.

సుప్రీంకోర్టులో తమిళనాడు స‌ర్కారుకు ఎదురుదెబ్బ‌.. ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీకి అనుమ‌తి

బీజేపీ, ఆరెస్సెస్ నేతలు ప్రేరేపిస్తున్న విద్వేషాలు, హింసను ప్రధాని విస్మరించారని సోనియా గాంధీ ఆరోపించారు.  ఒక్కసారి కూడా శాంతి, సామరస్యం కోసం పిలుపునివ్వలేదని, నేరస్థులను శిక్షించేలా వ్యవహరించలేదని అన్నారు. ‘‘మతపరమైన పండుగలు ఇతరులను భయపెట్టడానికి సందర్భాలుగా మారాయి. అవి ఆనందం, వేడుకల సందర్భాలుగా ఎప్పుడో దూరం అయ్యాయి.’’ అని అన్నారు.  ప్రధాని ఎంత ప్రయత్నించినా దేశ ప్రజలు మౌనంగా ఉండలేరని ఆమె తెలిపారు.

మధ్యప్రదేశ్ లో నర్మదా నదిపై నడిచిన మహిళ.. దేవత అంటూ పూజించిన ప్రజలు.. వీడియో వైరల్

రాబోయే కొన్ని నెలలు భారత ప్రజాస్వామ్యానికి కీలకమైన పరీక్ష అని నొక్కిచెప్పిన సోనియా గాంధీ.. దేశం క్రాస్ రోడ్స్ లో ఉందని, మోడీ ప్రభుత్వం ప్రతి అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ తన సందేశాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. ప్రజల గొంతును కాపాడటమే కాంగ్రెస్ పోరాటం అని, ప్రధాన ప్రతిపక్షంగా తన కర్తవ్యాన్ని అర్థం చేసుకుందని ఆమె అన్నారు.

ముందస్తు ప్రణాళిక ప్రకారమే బెంగాల్ లో రామనవమి హింసాకాండ - కలకత్తా హైకోర్టు

పార్లమెంటులో ఇటీవల జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ.. గత సమావేశాల్లో పార్లమెంటరీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడానికి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, సామాజిక విభజనలు వంటి తీవ్రమైన ఆందోళన కలిగించే సమస్యలను ప్రతిపక్షాలు లేవనెత్తకుండా నిరోధించడానికి, బడ్జెట్, అదానీ స్కామ్ వంటి ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని అన్నారు.

పాక్ లో కంటే భారతదేశంలో ముస్లింల పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది - నిర్మలా సీతారామన్

కేంద్ర దర్యాప్తు సంస్థ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, 95 శాతానికి పైగా రాజకీయ కేసులు కేవలం ప్రతిపక్షాలపై మాత్రమే నమోదయ్యాయని సోనియా గాంధీ అన్నారు. భారతీయ జనతా పార్టీలో చేరిన వారిపై కేసులు అద్భుతంగా ఆవిరైపోతున్నాయని ఆమె ఆరోపించారు. న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు కేంద్ర న్యాయ మంత్రి కొంతమంది రిటైర్డ్ న్యాయమూర్తులను దేశద్రోహులు అని పిలిచారని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios