శ్రీరామ నవమి ఊరేగింపుల సమయంలో పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్న హింసాకాండ ప్రకారమే జరిగిందని కలకత్తా హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి ఇంటెలిజెన్స్ వైఫల్యమే దీనికి కారణమని పేర్కొంది.

హౌరాలోని శిబ్‌పూర్, నార్త్ దినాజ్‌పూర్‌లోని దల్‌ఖోలాలో ఇటీవల జరిగిన రామనవమి హింసాకాండ ముందస్తు ప్రణాళికతో జరిగిందని కలకత్తా హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వైఫల్యమే దీనికి కారణమని పేర్కొంది. ఎన్‌ఐఏ దర్యాప్తునకు కోరుతూ ప్రతిపక్ష నేత సువెందు అధికారి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. దీని కోసం కేంద్ర ఏజెన్సీని ఆదేశిస్తామని కోర్టు సూచించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ శివజ్ఞాన్‌, జస్టిస్‌ హిరణ్‌మయ్‌ భట్టాచార్యలతో కూడిన డివిజన్‌ ​​బెంచ్‌ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ తమ ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది.

పాక్ లో కంటే భారతదేశంలో ముస్లింల పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది - నిర్మలా సీతారామన్

“ఇంటర్నెట్ సస్పెన్షన్ అనేది సాధారణంగా బయటి నుంచి ప్రమాదం ఉన్నప్పుడు, లేదా చొరబాటు మొదలైనప్పుడు జరుగుతుంది. కానీ మతపరమైన ఊరేగింపు సమయంలో ఎందుకు జరుగుతుందో మాకు అర్థం కాలేదు. ఆకస్మిక హింస అంటే ప్రజలు నడుచుకుంటూ వెళుతుండగా గొడవ మొదలైనప్పుడు జరుగుతుంది. కానీ మీ (రాష్ట్రం) ప్రాథమిక దృష్టిలో ఇవి (హింస) ముందే ప్లాన్ చేసినవే. పైకప్పులపై నుంచి రాళ్లు ఉంచినట్టు ఆరోపణలున్నాయి. మామూలుగా అయితే 10 నుండి 15 నిమిషాలలోపు రాళ్లను పైకప్పుపైకి తీసుకెళ్లడం ఎవరికీ సాధ్యం కాదు ” అని చీఫ్ జస్టిస్ శివజ్ఞాన్ అన్నారు.

దారుణం.. ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ స్ట్రీమ్ చేస్తూ.. ఐదుగురు కొలీగ్స్ ను కాల్చి చంపిన బ్యాంక్ ఉద్యోగి.. ఎక్కడంటే

హింస వల్ల ఎవరికి లాభం జరిగిందో, ఎవరికి నష్టం జరిగిందో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం కోరింది. ఈ కేసును రాష్ట్ర పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేస్తున్నారని అడ్వొకేట్ జనరల్ ఎస్ ఎన్ ముఖర్జీ పేర్కొన్నారు. ఊరేగింపులో పాల్గొన్న వారిపై లాఠీలు, కత్తులు తదితరాలు ఉన్నాయని, వాటిని తీసుకెళ్లడానికి అనుమతించలేదని తెలిపారు. దీంతో పాటు ఆయుధాలు కూడా ఉన్నాయని చెప్పారు. 

ఫోన్ వాడనివ్వలేదని టీనేజీ బాలిక ఆత్మహత్య.. ఏడంతస్తుల భవనంపై నుంచి దూకి..

శ్రీరామనవమి అల్లర్లపై బీజేపీపై దీదీ ఫైర్
రామనవమి ఊరేగింపుల్లో జరిగిన హింసాకాండలో బీజేపీ సభ్యులు భాగస్వాములయ్యారని సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. మతపరమైన ఊరేగింపులో ఆయుధాలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. చాలా మందిని బయటి నుంచి తీసుకొచ్చారని ఆరోపించారు. అల్లర్లపై నిజనిర్ధారణ బృందాన్ని పంపిన ఎన్జీవోపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.