పాకిస్థాన్ లోని ముస్లిం కంటే భారత్ లోని ముస్లిం పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇక్కడ ముస్లింలు సొంత వ్యాపారాలు చేసుకుంటారని, వారి పిల్లలు చదువుకుంటున్నారని తెలిపారు. కొందరికి ప్రభుత్వం ఫెలోషిప్ కూడా ఇస్తోందని చెప్పారు. 

పాకిస్థాన్‌లో నివసిస్తున్న ముస్లింల కంటే భారతదేశంలోని ముస్లింల పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు సమావేశంలో పాల్గొనేందుకు ఆమె వాషింగ్టన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ (పీఐఐఈ) కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. భారత్‌పై పాశ్చాత్య దేశాలపై ఉన్న అభిప్రాయంపై సమాధానాలు ఇచ్చారు.

పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని.. 17యేళ్ల బాలికపై కత్తితో దాడి చేసిన ప్రేమికుడు..

భారతదేశంలో పెట్టుబడును ప్రభావితం చేసే అవగాహనలకు సంబంధించిన ప్రశ్నకు ఆమె స్పందించారు..‘‘ ఈ సమాధానం భారతదేశానికి వచ్చే పెట్టుబడిదారుల వద్ద ఉందని నేను భావిస్తున్నాను. పెట్టుబడి పెట్టాలనే ఆసక్తి ఉన్న ఏ పెట్టుబడిదారుడికైనా, భారత్ లో ఏమి జరుగుతుందో చూడాలని, గ్రౌండ్ రియాలిటీ చూడాలని, కేవలం కొంత మంది చేసే అపోహలను నమ్మవద్దని నేను వారికి చెప్తాను.’’ అని అన్నారు. 

దారుణం.. ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ స్ట్రీమ్ చేస్తూ.. ఐదుగురు కొలీగ్స్ ను కాల్చి చంపిన బ్యాంక్ ఉద్యోగి.. ఎక్కడంటే

ప్రతిపక్ష పార్టీ ఎంపీలు తమ స్థానాలను కోల్పోవడం, భారత్ లో ముస్లిం మైనారిటీలపై హింసపై మీడియాలో వస్తున్న కథనాలపై అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ‘‘ప్రపంచంలో ముస్లింలు రెండో అతిపెద్ద జనాభాను కలిగి ఉన్న దేశం భారతదేశం. ఇంకా పెరుగుతోంది. భారతదేశంలో ముస్లింల జీవితం కష్టతరంగా మారిందని ఎవరైనా భావిస్తే ..1947తో పోలిస్తే ముస్లిం జనాభా పెరిగేదా? ’’ అని అన్నారు. 

రాజకీయాలు మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరు దాడి.. ఘర్షణలో ఒకరు మృతి

పాక్ కంటే భారత్ లో ముస్లిం సంఖ్య ఎక్కువుందని సీతారామన్‌ అన్నారు. ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకుని, మైనారిటీలను ఆదుకుంటామని వాగ్దానం చేసిన పాకిస్తాన్ నేడు ప్రతి మైనారిటీ కమ్యూనిటీ సంఖ్య తగ్గుతోందని చెప్పారు. కొన్ని ముస్లిం వర్గాలు కూడా అంతరించిపోయాయని తెలిపారు. “ముహాజిర్లు, షియాలు, కొన్ని ఇతర సమూహాలపై హింస ఉంది. ప్రధాన స్రవంతిలో అంగీకరించని ముస్లిం సంఘాలు ఇవి. అయితే భారతదేశంలో ప్రతి తరగతి ముస్లింలు తమ సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. వారి పిల్లలు చదువుకుంటున్నారు. కొన్ని వర్గాల పిల్లలకు ప్రభుత్వం ఫెలోషిప్ ఇస్తోంది’’ అని తెలిపారు.