Asianet News TeluguAsianet News Telugu

ప్రజలకు మంచి చేయడం కంటే.. సీట్ల మీదనే కాంగ్రెస్ ఫోకస్ - డీఎంకే మంత్రి సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్ (congress) ప్రజల కోసం పని చేయదని, ఆ పార్టీకే కేవలం సీట్లు సంపాదించడంపైనే ఫోకస్ ఉంటుందని డీఎంకే (DMK) నాయకుడు, తమిళనాడు మంత్రి రాజా కన్నప్పన్ (Tamil Nadu Minister Raja Kannappan) అన్నారు. అందుకే బీజేపీ (BJP) అతి చేస్తోందని, కానీ తమ పార్టీతో అలా చేయదని ధీమా వ్యక్తం చేశారు.

Congress focus on seats instead of doing good for people - DMK minister's sensational comments..isr
Author
First Published Jan 27, 2024, 3:11 PM IST

కాంగ్రెస్ పార్టీపై మిత్రపక్ష డీఎంకేకు చెందిన మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ రానున్న లోక్ సభ ఎన్నికల్లో సీట్లు సంపాదించుకోవడంపైనే ఫొకస్ చేసిందని ఆరోపించారు. సీట్ల కోసమే ఆ పార్టీని నాయకులు నడుపుతున్నారని తమిళనాడు మంత్రి రాజా కన్నప్పన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాత, పెద్ద పార్టీ అయినప్పటికీ.. తన బలాన్ని కోల్పోయిందని తెలిపారు.

కామారెడ్డి ఎమ్మెల్యే మంచి మనస్సు.. డెవలప్ మెంట్ కోసం సొంత ఇంటినే కూలుస్తున్న కాటిపల్లి

‘‘కాంగ్రెస్ పార్టీని కేవలం సీట్ల కోసమే నడుపుతున్నారు. దానివల్ల ఉపయోగం ఏమిటి? కష్టపడి పనిచేయాలని, ప్రజలకు మంచి చేయాలని భావించి పార్టీని నడపడం లేదు. కానీ ఎన్నికలు దగ్గరపడగానే ఆ పార్టీ వస్తుంది. అది ప్రజల మధ్య పని చేయదు’’ అని తెలిపారు. అందుకే బీజేపీ అతి చేస్తోందని అన్నారు. కానీ తమతో ఆ పార్టీ అలా చేయదని, తమకు భయం లేదని అన్నారు. ఆ పార్టీని తరిమేస్తామని, బీజేపీని తాము చూసుకుంటామని అన్నారు.

ఎన్డీఏ కూటమికి నితీష్ కుమార్ ఖాయమే.. నేడు బీజేపీ కార్యవర్గ సమావేశం.. కానీ ట్విస్ట్ ఏంటంటే ?

ఇదిలా ఉండగా.. ఇండియా కూటమి నుంచి జేడీ(యూ) దూరం అవుతోందని వార్తలు రావడం, ఆప్, టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడం పట్ల డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. ఇండియా కూటమి నేతలు ఐక్యంగా ఉండాలని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలిపోకుండా చూడాలని తన మిత్రపక్షాలను కోరారు.

ఇండియా కూటమిలో ఉంటే నితీష్ కుమార్ ప్రధాని అయ్యేవారు - అఖిలేష్ యాదవ్

పశ్చిమబెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీ, ఆప్ లు ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. బీహార్ మహాకూటమి నుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలోకి జేడీ (యూ) చీఫ్ నితీష్ కుమార్ యాదవ్ చేరబోతున్నారని విస్తృతంగా చర్చ జరుగుతోంది. సీట్ల పంపకాల చర్చలు విఫలం కావడంతో టీఎంసీ, ఆప్ లు తమ ఎత్తుగడలు వేశాయి. అయితే నితీష్ కుమార్ కూడా చర్చల పురోగతిపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన కూడా ఇండియా కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. 

చర్యకు ప్రతిచర్య ఉంటుంది.. గుమ్మడి కాయ దొంగలు అవ్వొద్దు - టీడీపీకి నాగబాబు కౌంటర్

నితీష్ కుమార్ రేపు (ఆదివారం) మరో సారి బీజేపీతో కలిసి బీహార్ లో ప్రభుత్వాన్ని చేసి, మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు వర్గాలు చెబుతున్నాయి. దీనిపై చర్చించేందుకు బీజేపీ విస్తృత కార్యవర్గం సమావేశానికి నేడు నిర్వహి్తోంది. ఈ సమావేశం సాయంత్రం 4 గంటలకు పాట్నాలో జరగనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీహార్ ఇంచార్జీ వినోద్ తావ్డే కూడా హాజరవుతున్నారు. అయితే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలని ఆదేశాలు వెళ్లాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios