ఇండియా కూటమిలో ఉంటే నితీష్ కుమార్ ప్రధాని అయ్యేవారు - అఖిలేష్ యాదవ్
ఇండియా కూటమి (India alliance)లో కొనసాగి ఉంటే బీహార్ సీఎం నితీష్ కుమార్ (Bihar CM Nitish Kumar) ప్రధాని అయ్యేవారని (Bihar CM Nitish Kumar would have become the Prime Minister) సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (samajwadi party chief akhilesh yadav) అన్నారు. కాంగ్రెస్ కూడా ఈ విషయంలో ఆయనతో చర్చించి ఉండాల్సిందని అన్నారు. నితీష్ కుమార్ ఇండియా కూటమిలోనే కొనసాగాలని తాను కోరుకుంటున్నాని చెప్పారు.
Nitish Kumar : బీహార్ సీఎం, జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్ మళ్లీ బీజేపీతో జత కట్టి ఎన్డీఏ కూటమిలో చేరుతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆదివారం ఆయన మరో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ ప్రతిపక్ష ఇండియా కూటమిలోనే ఉండి ఉంటే ప్రధాని అయ్యేవారని వ్యాఖ్యానించారు.
విషాదం.. 220 మంది చిన్నారులు దుర్మరణం.. ఇదేం మహహ్మారి..
‘ఇండియా టుడే టీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో ప్రధాని పదవికి ఎవరినైనా పరిగణనలోకి తీసుకోవచ్చని తెలిపారు. నితీష్ కుమార్ సరైన మద్దతుతో పోటీదారుగా ఉండవారని, ఆయనే ప్రధాని కూడా అయ్యేవారని చెప్పారు. ఇండియా భాగస్వామ్య పక్షాలతో సమీకరణాలు దెబ్బతినడంతో బీహార్ సీఎం బీజేపీతో సంబంధాలను పునరుద్ధరించుకుంటారనే ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నితీశ్ కుమార్ యూటర్న్ తీసుకోవడంపై అఖిలేష్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జేడీయూ చీఫ్ ఇండియా కూటమిలోనే కొనసాగాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. నితీష్ కుమార్ చొరవ తీసుకునే ఈ కూటమిని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలని, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి అసంతృప్త మిత్రపక్షాలతో మాట్లాడాలని సూచించారు.
Telangana Congress: ఏపీ ఎన్నికల్లో టీ కాంగ్రెస్.. ఈ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?
‘‘ఇండియా కూటమి విషయంలో, ఆయన (నితీష్ కుమార్) పట్ల కాంగ్రెస్ చూపాల్సిన సంసిద్ధత చూపలేదు. అతనితో మాట్లాడి వుండాలి. నితీష్ కుమార్ కూడా అసంతృప్తికి గల కారణాన్ని చర్చించి ఉండాల్సింది. అలా చేస్తే మాటలు వినవచ్చు. వారితో మాట్లాడితే పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నాను.’’ అని అన్నారు.
భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంబంధించి ఇప్పటి వరకు తనకు ఆహ్వానం అందలేదని చెప్పారు. అది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న న్యాయ యాత్ర అని, సమాజ్‌వాదీ పార్టీని ఎప్పుడు పిలుస్తారో పరిశీలిద్దామని తెలిపారు. కాగా.. సీట్ల పంపకానికి ఇదే సమయం అని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇలా చేయడం వల్ల అభ్యర్థులు తమ పని మొదలుపెట్టవచ్చని అన్నారు. సరైన సమయంలో సీట్ల పంపకాలు జరగాలని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత ఈ పదవిలో ఎవరిని కూర్చోబెడతారో నిర్ణయిస్తామని అన్నారు. ఎవరైనా ప్రధాని కావచ్చని అన్నారు.
గవర్నర్ కాంగ్రెస్ లో చేరిపోవాలి.. బీజేపీ, కాంగ్రెస్ లది ఫెవికాల్ బంధం - కేటీఆర్
తాను ప్రధాని పదవికి పోటీ పడటం లేదని, ప్రాంతీయ పార్టీలకు గణనీయమైన బలం ఉన్న చోట ప్రాధాన్యత ఇవ్వాలని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. రామమందిరం వివాదంపై మాట్లాడుతూ బీజేపీ ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని, దాని నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాను కూడా అయోధ్యకు వెళ్తానని, అయితే 2024లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మంచి సమయం చూసుకొని వెళ్లి వస్తానని చెప్పారు.