కామారెడ్డి ఎమ్మెల్యే మంచి మనస్సు.. డెవలప్ మెంట్ కోసం సొంత ఇంటినే కూలుస్తున్న కాటిపల్లి

బీజేపీ నాయకుడు (BJP Leader), కామారెడ్డి ఎమ్మెల్యే  కాటిపల్లి వెంకట రమణారెడ్డి (Kamareddy MLA Katipalli Venkata Ramana Reddy) తన మంచి మనసు చాటుకున్నారు. రోడ్డు విస్తరణలో తన ఇళ్లు అడ్డుగా ఉందని, దానిని కూల్చేయబోతున్నారు (MLA Katipalli Venkata Ramana Reddy to demolish his house for obstructing road widening). దీంతో ఆయనపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

Kamareddy MLA has a good mind. Katipalli, who is demolishing his own house for development..ISR

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిన పేరు కాటిపల్లి వెంకట రమణారెడ్డి. బీఆర్ఎస్ నుంచి సీఎం అభ్యర్థిగా ఉన్న కేసీఆర్, కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థిగా (అప్పటికి అనధికారికంగా) ఉన్న రేవంత్ రెడ్డిలను ఓడించి మొట్టమొదటి సారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. కామారెడ్డిలో సొంత చరిష్మాతో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పేరు అప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.

అయ్యో పాపం.. అవార్డు అందుకున్న గంటలోనే ప్రభుత్వ ఉద్యోగి హఠాన్మరణం

ఇద్దరు సీఎం ఫేస్ లను ఓడించిన ఆయన.. మరో సారి తన గొప్ప మనసు చాటుకొని వార్తల్లో నిలిచారు. తన నియోజకవర్గంలో రోడ్డు అభివృద్ధిలో అడ్డుగా వస్తోందని ఏకంగా సొంత ఇంటిని పడగొట్టేస్తున్నారు. ఈ విషయం తెలియడంతో నియోజకవర్గమే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

ఇండియా కూటమిలో ఉంటే నితీష్ కుమార్ ప్రధాని అయ్యేవారు - అఖిలేష్ యాదవ్

కామారెడ్డి పట్టణంలో రోడ్లను విస్తరించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రోడ్లను విస్తరించాలంటే అడ్డుగా వచ్చిన నిర్మాణాలను కూల్చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఇళ్లు కూడా ఉంది. దీనికి ఆయన సమ్మతించారు. రోడ్ల విస్తరణ కోసం తన ఇళ్లు కూల్చినా అభ్యంతరం లేదని చెప్పారు. దీంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే నివాసం దగ్గర నుంచి ఓల్డ్ బస్టాండ్ వరకు రోడ్డు విస్తరించేందుకు అడ్డుగా ఉన్న అన్ని నిర్మాణాలకు నోటీసులు ఇవ్వాలని అధికారులు సిద్దమయ్యారు. అయితే ఇందులో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న షబ్బీర్ అలీ ఇళ్లు కూడా ఉంది. దీంతో పాటు రెండు సినిమా టాకీసులు ఉన్నాయి.

ఎన్డీఏ కూటమికి నితీష్ కుమార్ ఖాయమే.. నేడు బీజేపీ కార్యవర్గ సమావేశం.. కానీ ట్విస్ట్ ఏంటంటే ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి నియోజకవర్గం రాష్ట్ర ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. అందులో ఒకటి తన సొంత నియోజకవర్గం గజ్వెల్ కాగా.. రెండోది కామారెడ్డి. కేసీఆర్ పై పోటీ చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కొండగల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దిగారు. దీంతో ఈ నియోజకవర్గం అప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ తరుఫున మంత్రులు, కేటీఆర్ కూడా ప్రచారం చేశారు.. కాంగ్రెస్ తరుఫున రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యమైన నాయకులు ప్రచారం నిర్వహించారు. 

చర్యకు ప్రతిచర్య ఉంటుంది.. గుమ్మడి కాయ దొంగలు అవ్వొద్దు - టీడీపీకి నాగబాబు కౌంటర్

కానీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమాణారెడ్డి ముందు వారి ఎత్తుగడలు ఫలించలేదు. బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో తో పాటు ఆయన తన నియోజకవర్గానికి సొంత మేనిఫెస్టో ను ప్రకటించారు. తన సొంత నిధులతో ఆ హామీలను నెరవేరుస్తానని మాట ఇచ్చారు. దీంతో ఆయన ఇద్దరు రాజకీయ ఉద్దండులను ఓడించి పత్రికల ప్రధాన శీర్షికలకు ఎక్కారు. కేంద్ర మంత్రులు కూడా ఆయనను ప్రశంసించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios