చర్యకు ప్రతిచర్య ఉంటుంది.. గుమ్మడి కాయ దొంగలు అవ్వొద్దు - టీడీపీకి నాగబాబు కౌంటర్
టీడీపీ (TDP) రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం, వెను వెంటనే జనసేన (Janasena) కూడా రెండు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయడాన్ని ఉద్దేశించి పరోక్షంగా నాగబాబు (Naga babu tweet) స్పందించారు. చర్యకు ప్రతిచర్య (there is reaction to every action) ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు.
టీడీపీ, జనసేనకు అంతర్గతంగా విభేదాలు వచ్చినట్టు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు పొత్తుతో పోటీ చేస్తామని ప్రకటించినప్పటికీ.. ఇటీవల ఇరు పార్టీల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు గమనిస్తే ఈ మైత్రి ఎంత కాలం ఉంటుందోనని అనుమానాలు వ్యక్తం అవతున్నాయి. ఇటీవల తనపై ఒత్తిడి పెరిగిపోతోందని చెబుత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పోటాపోటీగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా నిన్న (శుక్రవారం) రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
ఎన్డీఏ కూటమికి నితీష్ కుమార్ ఖాయమే.. నేడు బీజేపీ కార్యవర్గ సమావేశం.. కానీ ట్విస్ట్ ఏంటంటే ?
దీంతో రెండు పార్టీల మధ్య ఇప్పుడే లుకలుకలు మొదలైనట్టు ఉన్నాయని ఏపీ పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వాదనకు పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు చేసిన ట్వీట్ మరింత బలం చేకూరుస్తోంది. టీడీపీ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం, దానికి కౌంటర్ గా జనసేన కూడా రెండు స్థానాలను ప్రకటించడాన్ని పరోక్షంగా ఉద్దేశించి పోస్ట్ చేశారు. అందులో న్యూటన్ సిద్ధాంతాన్ని ఉదహరించారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.
ఈ ట్వీట్ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అది విపరీతంగా వైరల్ అయ్యింది. టీడీపీ ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్ పై చర్చ జరుగుతున్న తరుణంలోనే నాగబాబు మరో ట్వీట్ చేశారు. అందుతో తాను పెట్టే ప్రతీ పోస్ట్ కు ఏదో ఒక అర్థం ఉంటుందని అనుకోవద్దని అన్నారు. కొన్ని సార్లు సమాచారం కోసం మాత్రమే ఇలా పోస్ట్ లు చేస్తుంటానని పేర్కొన్నారు. ఈ రోజు ఫిజిక్స్ నియమాలను పోస్ట్ చేశానని రేపు ఇంకా కొన్నింటిపై పోస్టులు చేస్తానని తెలిపారు. వీటి గురించి ఆలోచించకూడదని, గుమ్మడి కాయల దొంగలు అవ్వొద్దని ఆయన సూచించారు.
ఈ రెండో ట్వీట్ లో ఉన్న అర్థాన్ని చూస్తే మెగా బ్రదర్ నాగబాబు మరిన్ని ట్వీట్ లు చేస్తూనేఉంటారని అర్థం అవుతోంది. అయితే ఇప్పుడే ఇరు పార్టీల మధ్య మొదలైన చిన్నపాటి ఘర్షణ వల్ల టీడీపీ-జనసేన పొత్తు కొనసాగుతుందా ? లేదా ? అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కాస్తా, అటు ఇటూ అయినా టీపీపీతో పొత్తు కొనసాగిస్తామని, జగన్ కు అధికారం దక్కనివ్వకపోవడమే తమ లక్ష్యం అని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పష్టం చేసినప్పటికీ.. రాజకీయాల్లో ఎప్పుడు ఏమీ జరుగుతుందో తెలియదు కదా.. ఎన్నికల సమీపించే వరకు ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.