ఎన్డీఏ కూటమికి నితీష్ కుమార్ ఖాయమే.. నేడు బీజేపీ కార్యవర్గ సమావేశం.. కానీ ట్విస్ట్ ఏంటంటే ?
జేడీ (యూ) (JD-U) చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ మళ్లీ ఏన్డీఏ కూటమిలో (Bihar CM Nitish kumar joins NDA alliance) చేరడం దాదాపుగా ఖారారు అయిపోయింది. నేటి సాయంత్రం బీహార్ (bihar) బీజేపీ రాష్ట్ర విస్తృత కార్యవర్గం సమావేశం (Bihar BJP state executive meets) నిర్వహించనుంది. దీనికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీహార్ ఇంచార్జీ వినోద్ తావ్డే (National General Secretary and Bihar in-charge Vinod Tawde) హాజరు అవుతున్నారు.
బీహార్ లో రాజకీయ పరిణామాలు ఒక్క సారిగా మారిపోయాయి. నితీశ్ కుమార్ మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పొత్తు పొట్టుకుంటారని జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సస్పెన్స్ ఇలా కొనసాగుతుండగానే బీజేపీ విస్తృత కార్యవర్గం సమావేశానికి నేడు (శనివారం) పిలుపునిచ్చింది. ఈ సమావేశం సాయంత్రం 4 గంటలకు పాట్నాలో జరగనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీహార్ ఇంచార్జీ వినోద్ తావ్డే కూడా హాజరవుతున్నారు. అయితే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలని ఆదేశాలు వెళ్లినట్టుగా సమాచారం.
ఇండియా కూటమిలో ఉంటే నితీష్ కుమార్ ప్రధాని అయ్యేవారు - అఖిలేష్ యాదవ్
ఈ పరిణామంతో నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో మరో సారి చేరడం ఖాయమైపోయినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. నితీష్ కుమార్ ను మళ్లీ ఎన్డీఏ కూటమిలోకి చేర్చుకోవడంపై బీజేపీ నాయకులకు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. జేడీ (యూ) చీఫ్ తో సంబంధాలు పునరుద్ధరించుకోవడంపై పలువురు బీజేపీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. దానికి కారణాలు లేకపోలేదు. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ తండ్రీకొడుకుల ద్వయం, నితీశ్ కుమార్ పాలనా వ్యతిరేకత వంటి అంశాలు కాషాయ పార్టీ విజయానికి ముప్పుగా పరిణమించవచ్చని వారు భావిస్తున్నారు.
Palla Rajeswar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు..!
కాగా.. ఒక వేళ ఎన్డీఏ కూటమిలో చేరితే రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలతో పాటు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో జేడీయూ ఉన్నట్టు తెలిసింది. కానీ దీనిని బీజేపీ తిరస్కరించింది. బీహార్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే సారి జరిగితే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని, అందుకే బీజేపీ ఈ నిర్ణయానికి అడ్డుచెప్పిందని సమాచారం.
విషాదం.. 220 మంది చిన్నారులు దుర్మరణం.. ఇదేం మహహ్మారి..
ఇదిలా ఉండగా.. నితీష్ కుమార్ ఏం చేసిన ఆయన వెంట నడుస్తామని జేడీయూ నేతలు చెబుతున్నారు. తమ పార్టీ అధినేతను విశ్వసిస్తున్నామని, నితీష్ కుమార్ ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఆయన మార్గాన్ని అనుసరిస్తామని తెలిపారు. కాగా.. మళ్లీ జేడీయూ-బీజేపీల కొత్త కూటమికి సీఎంగా నితీష్ కుమార్ ఆదివారం (జనవరి 28) ప్రమాణ స్వీకారం చేస్తారని, బీజేపీ నేత సుశీల్ మోడీ డిప్యూటీ సీఎంగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు జోరందుకున్నాయి.