Asianet News TeluguAsianet News Telugu

దంపతుల ఘాతుకం: క్షుద్రపూజలు.. సెక్స్ వర్కర్లని ట్రాప్ చేసి, పిల్లల కోసం బలి

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం అగ్రరాజ్యాలతో పోటీపడుతున్న సంగతి తెలిసిందే. కానీ దేశంలో ఇంకా మూఢనమ్మకాలు మాత్రం పోవడం లేదు. గ్వాలియర్‌కు (gwalior) చెందిన బంటు బదౌరియా, మమత దంపతులు పిల్లల కోసం ఇద్దరు దంపతులను దారుణంగా హత్య చేశారు. 

childless couple sacrifices 2 sex workers in 1 week in madhya pradesh
Author
Gwalior, First Published Oct 24, 2021, 9:07 PM IST

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం అగ్రరాజ్యాలతో పోటీపడుతున్న సంగతి తెలిసిందే. కానీ దేశంలో ఇంకా మూఢనమ్మకాలు మాత్రం పోవడం లేదు. తాజాగా పిల్లల కోసం ఇద్దరు మహిళల్ని దారుణంగా హత్య చేశారు (sacrifice) దంపతులు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ (madhya pradesh) రాష్ట్రం గ్వాలియర్‌కు (gwalior) చెందిన బంటు బదౌరియా, మమత దంపతులకు 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వారికి ఇప్పటివరకు సంతానం కలగలేదు. దీంతో మిత్రుడు నీరజ్‌ పర్మార్‌ ఆ దంపతులను భూతవైద్యుడిగా చెప్పుకుంటున్న గిర్వార్‌ యాదవ్‌ వద్దకు తీసుకెళ్లాడు. 

ALso Read:వైద్యం పేరుతో మహిళపై అత్యాచారయత్నం, నరికి చంపిన భూతవైద్యుడు.. కోపంతో ఆ గ్రామస్తులు చేసిన పని..

వీరి సమస్య తెలుసుకున్న ఆ మాంత్రికుడు ఓ వ్యక్తిని బలిస్తే సంతానం కలుగుతుందని మాయమాటలు చెప్పాడు. అతని మాటలు నమ్మారు బదౌరియా దంపతులు . అయితే ఎవరినో ఒకరిని బలిచ్చేందుకు వేట ప్రారంభించిన వారి మిత్రుడు నీరజ్‌ పర్మార్‌.. ఈనెల 13న ఓ సెక్స్‌ వర్కర్‌ను తీసుకువచ్చాడు. అక్కడే ఆమెను హత్య చేసి ద్విచక్రవాహనంపై మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే కొద్దిదూరం వెళ్లగా.. బైక్‌ జారి కిందపడిపోయింది. ఎవరైనా చూస్తే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని భయాందోళన చెందిన నీరజ్‌ మృతదేహాన్ని రోడ్డు పక్కన తుప్పల్లో పడేసి అక్కడి నుంచి పారిపోయాడు.

అయితే ఆ తర్వాత కూడా వీరి ప్రవర్తనలో మార్పు రాలేదు. వారం రోజుల తర్వాత అంటే అక్టోబర్‌ 20న మరో సెక్స్‌ వర్కర్‌ను ట్రాప్‌చేసి ఆమెను కూడా దారుణంగా హత్యచేశారు. ఆమెకు మత్తుమందు ఇచ్చి భూతవైద్యుని సమక్షంలో బలిచ్చారు. ఈ క్రమంలో తొలుత హత్యకు గురైన మహిళ మృతదేహం ఈ 21న లభించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన నిందితుడు నీరజ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా వీరి నేరం బయటపడింది. దీంతో భూతవైద్యుడు సహా ఆ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios