ఢిల్లీ:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న#మీటూ ఉద్యమంపై ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చింది. మహిళలు తమపై జరిగిన లైంగిక దాడులను మీటూ వేదికగా బహిరంగ పరుస్తున్నారు. దీంతో లైంగిక దాడులకు గురైన మహిళలు పెద్ద సంఖ్యలో మీటూ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. 

అయితే మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్పందించారు. విచారణకు ప్రత్యేక ప్యానల్ ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. నలుగురు రిటైర్డ్ జడ్జీలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఈ నలుగురు సభ్యుల బృందం మీటూ ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన లైంగిక దాడులపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. 

పని ప్రదేశాల్లో మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను మీటూ పేరుతో బయటపెడుతున్నారు. కేంద్రమంత్రి దగ్గర నుంచి సినీ రంగానికి చెందిన ప్రముఖులు, ఇరత రంగాలకు చెందిన వ్యక్తులు మీటూ ఉద్యమం ద్వారా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత కొద్దిరోజులుగా మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. 

అటు కేంద్రమంత్రి ఎంజే అక్బర్ సైతం లైంగిక ఆరోపణల్లో ఇరుక్కున్నారు. అయితే కేంద్రమంత్రి పై ఎలాంటి చర్యలు తీసుకుంటారని అటు విదేశాంగ మంత్రి సుస్మస్వరాజ్ ని ప్రశ్నించినా నోరు విప్పలేదు. అటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కానీ ఆఖరికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కూడా ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదు. 

దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీటూ ఉద్యమానికి తన మద్దతు ప్రకటించారు. మహిళలను ఎంతగా గౌరవించాలనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన సమయం ఇది. 

మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వారి జీవితం ముగిసిపోతుంది. దీని పట్ల నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను.సమాజంలో మార్పు రావాలంటే నిజాన్ని నిర్భయంగా, గొంతెత్తి చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ రాహుల్‌గాంధీ మీటూ హ్యాష్‌ట్యాగ్‌ పెట్టి ట్వీట్‌ చేశారు. 

అయితే మీటూ ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన లైంగిక దాడులు, వేధింపుల కేసులన్నింటిపైనా బహిరంగ విచారణకు నలుగురు రిటైర్డ్ జడ్జీలతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమిస్తుందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ పేర్కొన్నారు. మీటూ క్యాంపెయిన్‌ ద్వారా మహిళలు తమపై జరిగిన నేరాలపై ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారని ఇటీవలే మేనకగాంధీ ప్రశంసించారు. 

10, పదిహేనేళ్ల తర్వాత సైతం లైంగిక వేధింపుల ఫిర్యాదులను అనుమతించాలని కోరుతూ ఆమె న్యాయమంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. లైంగిక వేధింపులకు ఎవరు పాల్పడ్డారనేది బాధితులకు తెలుస్తుందని అందుకే తాము ఫిర్యాదులకు ఎలాంటి కాలపరిమితి ఉండరాదని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. 

బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ పదేళ్ల కిందట ఓ సినిమా సెట్‌లో తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఊపందుకుంది. దీంతో ఎందరో నటీమణులు, పాత్రికేయులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి సామాజిక మాధ్యమాల ద్వారా బయటపెడుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

నేను అలా చేసి ఉంటే ఐశ్వర్య బతికుండేదే కాదు.. సల్మాన్ వీడియో వైరల్!

#మీటూ అంటున్న గుత్తా జ్వాలా.. షాకింగ్ కామెంట్స్

నాతో బలవతంగా మందు తాగించి రేప్ చేశాడు.. నటుడిపై ఆరోపణలు!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

ఆ నిర్మాత దారుణంగా హింసించాడు.. నటి ఫోటోలు వైరల్!