Asianet News TeluguAsianet News Telugu

నాతో బలవతంగా మందు తాగించి రేప్ చేశాడు.. నటుడిపై ఆరోపణలు!

బాలీవుడ్ లో మీటూ ఉద్యమం రోజురోజుకి ప్రకంపనలు సృష్టిస్తోంది. తనుశ్రీదత్తా తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బయటకి చెప్పడంతో ఆమెకి మద్దతుగా పలువురు సినీతారలు నిలుస్తున్నారు. 

Alok Nath accused of rape by writer-producer Vinta Nanda
Author
Hyderabad, First Published Oct 9, 2018, 10:12 AM IST

బాలీవుడ్ లో మీటూ ఉద్యమం రోజురోజుకి ప్రకంపనలు సృష్టిస్తోంది. తనుశ్రీదత్తా తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బయటకి చెప్పడంతో ఆమెకి మద్దతుగా పలువురు సినీతారలు నిలుస్తున్నారు. దీంతో ఇప్పుడు సినీ, మీడియా రంగాల్లో ఒక్కొక్కరు తమకు ఎదురైన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేస్తున్నారు.

తాజాగా ప్రముఖ రచయిత, ప్రొడ్యూసర్ వింటా నందా తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. రెండు దశాబ్దాలుగా తనలో తనే బాధపడుతున్న విషయాన్ని ఇప్పుడు బయటపెట్టారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమయం కోసం ఎదురుచూస్తున్నా.. అంటూ ఫేస్ బుక్ లో కొన్ని విషయాలను వెల్లడించారు.

ప్రముఖ సినీ, టీవీ నటుడు అలోక్ నాథ్ తనపై దారుణంగా అత్యాచారానికి  పాల్పడ్డాడని తెలిపారు. తనతో బలవంతంగా మద్యం తాగించి మరీ అలోక్ నాథ్ రేప్ చేశాడని 20 ఏళ్లనాటి సంఘటనని వివరించింది.

తనను మాత్రమే కాకుండా.. అప్పటి టీవీ షో తారా ప్రధాన నటిని కూడా అతడు లైంగికంగా వేధించాడని, దీనిపై కంప్లైంట్ చేసినందుకు ఆమెని షో నుండి తీశేసారని వెల్లడించింది. పచ్చి తాగుబోతు అయితే అలోక్ నాథ్ బయటకి మాత్రం మంచి వ్యక్తిగా చెలామణి అవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. 

Alok Nath accused of rape by writer-producer Vinta Nanda

Follow Us:
Download App:
  • android
  • ios