డ్రగ్స్ వ్యవహారం శాండిల్ వుడ్ లో వణుకుపుట్టిస్తోంది.  సినీ పరిశ్రమను ఆ కేసు చుట్టుముడుతోంది. సినీ నటి రాగిణి ద్వివేదిని బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ శాఖ (సీసీబీ) ఇంతకు ముందు అరెస్టు చేయగా, తాజాగా మంగళవారంనాడు సర్దార్ గబ్బర్ సింగ్ నటి సంజన గల్రానీని అరెస్టు చేశారు.

కాగా.. అరెస్టు అనంతరం సీసీబీ అధికారులు సంజనాని ప్రశ్నించగా.. 34మంది ప్రముఖుల పేర్లను ఆమె బయటపెట్టినట్లు సమాచారం. కాగా.. వాటిలో నిజమెంతో తెలుసుకునే పనిలో అధికారులు పడ్డారు. కాగా.. ఆ పేర్లలో మాజీ ఎమ్మెల్యేతో పాటు సినిమా, బుల్లితెర, వ్యాపారవేత్తల పుత్రులున్నట్లు తెలిసింది. మంగళూరు, యలహంక, కమ్మనహళ్లిలో జరిగిన హై–ఫై పార్టీలలో ఎవరెవరు పాల్గొన్నారనేది ఆరా తీస్తున్నారు. 

సంజనా, రాగిణి వాంగ్మూలాలను రికార్డ్‌ చేశారు. ఇతర నిందితులు వీరేన్‌ ఖన్నా, రాహుల్‌ నిర్వహించిన పార్టీలలో రాజకీయ, వ్యాపార, సినిమా రంగాల బడాబాబులు పాల్గొనేవారని సంజనా తెలిపింది. తను తప్పు చేశానని సంజన ఆవేదన చెందినట్లు సమాచారం. తనను మీడియా ముందు మాట్లాడే అవకాశం ఇవ్వాలని సంజన కోరినప్పటికీ అధికారులు అంగీకరించలేదు.

కాగా.. విచారణ సమయంలో నటి సంజనా కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆమె చాలా మానసిక ఒత్తిడి గురయ్యారని అధికారులు చెబుతున్నారు. రాగిణి ద్వివేది, సంజనాలకు ఐదు బెడ్లు ఉన్న ఒకే గదిలో ఉంచారట. వారిద్దరూ మాట్లాడుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వారికి కాపలాగా ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను ఉంచినట్లు తెలుస్తోంది. కాగా.. సంజన కనీసం రాత్రి భోజనం కూడా చేయలేదని.. బాగా  ఏడ్చిందని అక్కడి వారు చెబుతున్నారు.