Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం కారణంగా భార్యకు మెయింటెన్స్ ఇవ్వకుండా ఉండటం కుదరదు: బాంబే హైకోర్టు

భార్య గతంలో వివాహేతర సంబంధం కలిగి ఉన్నదని మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఉండటం కుదరదని బాంబే హైకోర్టు తెలిపింది. గృహ హింస కేసు పెట్టిన ఆ భార్య.. భర్త కుటుంబంతో దూరంగా ఉంటున్నది. అంతేకాదు, ఆ భర్త ఫ్రెండ్‌తోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నదని భర్త ఆరోపించారు. కాగా,  ఆమె అతడిపై రేప్ కేసు పెట్టింది. కానీ, తన ఎఫ్ఐఆర్‌లో మాత్రం ఆ వ్యక్తితో సహజీవనంలో ఉన్నట్టు ఆమె పేర్కొనడం గమనార్హం.
 

bombay high court orders maintenance to wife who had extramarital affair
Author
First Published Aug 14, 2022, 5:09 PM IST

ముంబయి: బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భర్త కుటుంబంపై గృహ హింస కేసు పెట్టి ప్రస్తుతం వేరుగా ఉంటున్న భార్యకు ఈ పిటిషన్ పై తీర్పు వెలువడే వరకూ మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే.. తన భార్యకు వివాహేతర సంబంధం పెట్టుకున్నదని, తాను మెయింటెనెన్స్ ఇవ్వబోనని చేసిన వాదనను సెషన్స్ కోర్టు అంగీకరించింది. కానీ, బాంబే హైకోర్టు సెషన్స్ కోర్టు తీర్పును తప్పుపట్టింది. భార్య గతంలో వివాహేతర సంబంధంలో ఉన్నంత మాత్రానా మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఉండటం కుదరదని తెలిపింది.

ఆ దంపతులు 2007లో పెళ్లి చేసుకున్నారు. 2020 జనవరిలో భార్య.. భర్త కుటుంబంపై గృహ హింస కేసు పెట్టింది. ఈ కేసులో మెజిస్ట్రేట్ కోర్టు 2021 ఆగస్టులో భార్యకు మధ్యంతరంగా మెయింటెన్స్ ఇవ్వాలని భర్త కుటుంబాన్ని ఆదేశించింది. మధ్యంతరంగా రూ. 75 వేలు నెలకు ఇవ్వాలని, ఈ కంప్లైట్ ఫైల్ అయినప్పటి నుంచి రూ. 35 వేలు రెంట్ ఇవ్వాలని ఆదేశించింది. కానీ, సెషన్స్ కోర్టు ఈ తీర్పును తోసిపుచ్చింది. మళ్లీ తాజాగా (జూన్ 28న), బాంబే హైకోర్టు మధ్యంతర మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందేనని తెలిపింది.

భార్య తరఫు న్యాయవాది వాదిస్తూ.. భార్తే తన మిత్రుడిని భార్య దగ్గరకు పంపాడని, ఆ వ్యక్తిపై తన భార్య రేప్ కేసు పెట్టిందని తెలిపారు. భర్త తండ్రి పాపులర్ రెస్టారెంట్ కలిగి ఉన్నాడని, వారు లగ్జరీగా జీవిస్తున్నారని వివరించారు.

భర్త తరఫు న్యాయవాది వాదిస్తూ.. భర్త మిత్రుడితో ఆమె వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నదని, రేప్ ఎఫ్ఐఆర్ బూటకమైందని చెప్పారు. ఆమె వివాహేతర సంబంధంలో ఉన్నందున ఆమెకు మెయింటెన్స్ ఇవ్వడానికి భర్తపై ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదని వాదించారు.

భర్త లగ్జరీగా జీవిస్తుంటే.. భార్య ఆ సౌలభ్యాలన్నింటినీ కోల్పోవాల్సిన అవసరం లేదని ఈ వాదనల తర్వాత జస్టిస్ ప్రకాశ్ నాయక్ తెలిపారు. కాబట్టి, మెయింటెనెన్స్ అవసరం లేదన్న సెషన్స్ కోర్టు తీర్పు అర్థరహితం అని పేర్కొన్నారు. భర్త కుటుంబం స్టేటస్‌ను పరిశీలించి.. భార్య సంపాదించే రూ. 38 వేలు ఆమెకు సరిపోవని, కాబట్టి, నెలకు రూ. 75 వేలు ఆమెకు ఇవ్వడం అవసరం అని వివరించారు. ఆమె వేరుగా ఉంటున్నందున ప్రత్యామ్నాయ వసతులు పొందే హక్కు ఆమెకు ఉంటుందని అన్నారు.

ఎఫ్ఐఆర్, మెజిస్ట్రేట్ కోర్టు ముందు ఆమె స్టేట్‌మెంట్లను ఉటంకిస్తూ.. నిందితుడితో ఆమె సహజీవనంలో ఉన్నదని అంగీకరించారని జస్టిస్ నాయక్ వివరించారు. ఈ కారణంగానే సీఆర్‌పీసీలోని సెక్షన్ 125(4) కింద మహిళ మెయింటెనెన్స్ పొందడానికి అనర్హురాలని సెషన్స్ కోర్టు భావించిందని చెప్పారు. 

కాగా, ఆ సెక్షన్ ఇప్పటికీ ఆ సంబంధం కొనసాగుతుంటే.. అని పేర్కొంటున్నదని భార్య తరఫు న్యాయవాది అన్నారు. గతంలో ఆ సంబంధం ఉన్నంత మాత్రానా మెయింటెనెన్స్ ఇవ్వకుండా తప్పుకోరాదని వివరించారు.

ఆమెకు గతంలో వివాహేతర సంబంధం ఉన్న కారణంగా మెయింటెనెన్స్ పొందడానికి ఆమె అనర్హురాలా? అనే సెషన్స్ కోర్టు చర్చనే ప్రశ్న అని జస్టిస్ నాయక్ తెలిపారు. భార్య వేసిన గృహ హింస కేసు పెండింగ్‌లోనే ఉన్నదని, ఆమెపై నిజంగా హింస లేదని, మరో వ్యక్తితో సహజీవనంలో ఉన్నదని, సొంతంగా సంపాదించుకుంటున్నదనే ప్రాథమిక వివరాలతో సెషన్స్ కోర్టు నిర్ణయం తీసుకుని ఉంటుందని హైకోర్టు పేర్కొంది. కొన్ని వీడియోలు, ఫొటోల ఆధారంగా ఆమె సహజీవనం పై ఓ నిర్ధారణకు వచ్చి ఉన్నారని, అందుకే భర్త మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనే తీర్పు ఇచ్చిందని తెలిపింది.

సెషన్స్ కోర్టు తీర్పును తోసిపుచ్చి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందేనని బాంబే హైకోర్టు ఆ భర్తను ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios