బీజేపీకి వరుణ్ గాంధీ మరో షాక్: వాజ్‌పేయ్ వీడియోను పోస్టు చేసిన ఎంపీ

లఖీంపూర్ ఖేరీ ఘటన తర్వాత మరోసారి రైతులకు మద్దతుగా బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ స్పందించారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాజ్‌పేయ్ చేసిన ప్రసంగం వీడియో క్లిప్ ను వరుణ్ గాంధీ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశాడు.

BJP MP Varun Gandhi shares clip of Vajpayee's speech in support of farmers

న్యూఢిల్లీ: Farmers మద్దతుగా Bjp Mp  వరుణ్ గాంధీ ఇటీవల కాలంలో ప్రకటనలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేస్తున్న ప్రకటనలు, పోస్టులు బీజేపీకి ఇబ్బందిగా మారాయి. మాజీ ప్రధాని  Vajpayee  రైతులకు మద్దతుగా చేసిన ప్రకటనకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ను వరుణ్ గాంధీ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంంలో రైతులకు మద్దతుగా వాజ్‌పేయ్ ప్రసంగం వీడియో క్లిప్ ను Varun Gandhi ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"పెద్ద మనసున్న నాయకుడి నోట తెలివైన మాటలు" అంటూ వరుణ్‌ గాంధీ ట్వీట్ చేశారు.  బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన  సందర్భంలో వాజ్‌పేయి ప్రసంగాన్ని షేర్‌ చేయడం కలకలం రేపుతోంది.

 చట్టాలను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం రైతులను అణచివేయడంపై వాజ్‌పేయి అప్పటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. "రైతులను భయపెట్టొద్దు. వారు భయపడాల్సిన అవసరం లేదు. మేము రైతుల ఉద్యమాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలనుకోవడం లేదు. కానీ అన్నదాతల శాంతియుత ఆందోళనను అణచివేయాలని చూస్తే మాత్రం వారికి అండగా నిలబడటానికి ఏమాత్రం వెనుకాడము" అని వాజ్‌పేయి  అప్పటి కేంద్రాన్ని హెచ్చరించారు. ఈ ప్రసంగం క్లిప్పింగ్ ను వరుణ్ గాంధీ ట్విట్టర్ లో పోస్టు చేశాడు.

 


కేంద్రంలోని Narendra Modi  సర్కార్ మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది.ఈ చట్టాలను రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రైతు సంఘాలకు విపక్షాలు మద్దతును ప్రకటించాయి.ఈ బిల్లులను పాస్ చేసే సమయలో రాజ్యసభలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.

also read:Lakhimpur Kheri : కొడుకు ట్వీట్..తల్లికి ఉద్వాసన.. బీజేపీ కేంద్ర కమిటీ నుంచి మేనకా గాంధీ అవుట్...

రైతు సంఘాల నేతలు కొందరు Supreme court ఆశ్రయించడంతో  మూడు నూతన వ్యవసాయ చట్టాల అమలుపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని Lakhimpur kheri లో  రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో వారిపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న హింసాత్మక ఘటనల్లో మరో నలుగురు మృతి చెందారు.లఖీంపూర్ ఖేరీ ఘటనపై ఆయన బహిరంగంగానే మాట్లాడారు.

హత్యలతో వారి నోళ్లు మూయించలేరంటూ ఈ సంఘటన వీడియోను ట్వీట్ చేశారు. అమాయక రైతుల రక్తం చిందిన వైనానికి జావాబుచెప్పాలని, నలుగురు రైతుల మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వరుణ్‌ గాంధీ డిమాండ్‌ చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios