Asianet News TeluguAsianet News Telugu

Lakhimpur Kheri : కొడుకు ట్వీట్..తల్లికి ఉద్వాసన.. బీజేపీ కేంద్ర కమిటీ నుంచి మేనకా గాంధీ అవుట్...

ఉత్తరప్రదేశ్ లోని Lakhimpur Kheriలో ఆదివారం జరిగిన ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిదిమంది చనిపోయారు. కాగా, రైతులకు మద్దతుగా varun gandhi వరుణ్ గాంధీ  ట్విట్టర్ లో స్పందించారు. 

BJP Acts Against Varun Gandhi After His Tweets On Farmers Run Over
Author
Hyderabad, First Published Oct 7, 2021, 3:03 PM IST

న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీని భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ నుంచి తొలగించారు. ఆమె కుమారుడు, ఎంపీ వరుణ్ గాంధీ రైతు ఆందోళనల మీద ట్వీట్లు చేయడంతో maneka gandhi పై వేటు వేశారు. 

ఉత్తరప్రదేశ్ లోని Lakhimpur Kheriలో ఆదివారం జరిగిన ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిదిమంది చనిపోయారు. కాగా, రైతులకు మద్దతుగా varun gandhi వరుణ్ గాంధీ  ట్విట్టర్ లో స్పందించారు. 

‘తన మనసును కలిచివేసింది’ అంటూ వరుణ్ ట్వీట్ చేశారు. కాగా బుధవారం కూడా ఈ విషయం మీద స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘వీడియోలో చాలా క్లియర్ గా కనిపిస్తోంది. రైతులు రక్తం ధార పోశారు. 

ఆ రక్తానికి బాధ్యత ఎవరిది? రైతులు తీవ్ర ఆగ్రహానికి లోను కాకముందే న్యాయం లభించాలి’ అని ట్వీట్ చేశార. గతంలో కూడా రైతు ఆందోళనపై వరుణ్ ట్వీట్ చేశారు. రైతులకు కనీస మద్దతు ధరతోపాటు వారికి కల్పించాల్సిన  వసతులమీద ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాశారు. కొంతకాలంగా వరుణ్ గాంధీ వ్యవహారశైలి మీద ఆగ్రహంగా ఉన్న బీజేపీ అధిష్టానం. తాజా స్పందనతో మేనకాపై వేటు వేసినట్లు చెప్పుకొస్తున్నారు. 

Lakhimpur Kheri: విచారణ శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీం.. ‘డీటెయిల్డ్ రిపోర్ట్ సమర్పించండి’

కాగా, ఈ నెల మూడున ఉత్తర్‌ప్రదేశ్‌లోని లకింపూర్‌ ఖేరీ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి కాన్వాయ్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులతో సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

లకింపూర్‌ ఖేరీ జిల్లా టికునియాలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఆదివారం హాజరయ్యారు. వీరి పర్యటనను నిరసిస్తూ ఉదయం నుంచి రైతులు నల్ల జెండాలు చూపిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

అదే సమయంలో కేంద్రమంత్రి, డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ రోడ్డు పక్కనే ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది మ మృతి చెందారని సంయుక్త కిసాన్‌ మోర్చా తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios