రైడ్ క్యాన్సిల్ చేసిందని, మహిళకు న్యూడ్ ఫోటోలతో క్యాబ్ డ్రైవర్ వేధింపులు..!
క్యాబ్ బుక్ అయ్యింది కానీ, రావడానికి సమయం పట్టింది. ఈలోగా పిల్లలు ఏడుస్తుండటంతో, ఆటో కనిపడితే అది ఏక్కేసింది. ఈ లోగా క్యాబ్ రైడ్ క్యాన్సిల్ చేసింది.
క్యాబ్ బుక్ చేసి ఆ తర్వాత వెంటనే ఓ మహిళ రైడ్ క్యాన్సిల్ చేసింది. అయితే, రైడ్ క్యాన్సిల్ చేసిందనే కారణంతో డ్రైవర్ ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఫోన్ లో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. న్యూడ్ ఫోటోలు పంపడం మొదలుపెట్టాడు. అతని వేధింపులు తట్టుకోలేక, సదరు మహిళ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన బంగళూరులో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరు నగరానికి చెందిన ఓ మహిళ తన ఆరు ఏళ్ల కుమార్తె ను స్కూల్ నుంచి తీసుకొని రావడానికి వెళ్లింది. చేతిలో 9 నెలల బాబు కూడా ఉన్నాడు. తీరా స్కూల్ కి వెళ్లిన తర్వాత పాప నడుచుకుంటూ ఇంటికి రావడానికి నిరాకరించింది. దీంతో, సదరు మహిళ క్యాబ్ బుక్ చేసింది. క్యాబ్ బుక్ అయ్యింది కానీ, రావడానికి సమయం పట్టింది. ఈలోగా పిల్లలు ఏడుస్తుండటంతో, ఆటో కనిపడితే అది ఏక్కేసింది. ఈ లోగా క్యాబ్ రైడ్ క్యాన్సిల్ చేసింది.
అంతే, ఆమెకు క్యాబ్ డ్రైవర్ దినేష్ కాల్ చేశాడు. ఆమె తన పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించింది. కానీ, ఆ క్యాబ్ డ్రైవర్ వినిపించుకునేలా లేకపోవడం గమనార్హం. ఆమెను ఇబ్బంది పెట్టాలా, అసభ్యకరమైన ఫోటోలను పంపడం మొదలుపెట్టాడు. దీంతో, ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత తమ అపార్ట్ మెంట్ లోని వారికి విషయం చెప్పడంతో, వారు సదరు డ్రైవర్ ని బెదిరించారు. దీంతో, ఆ ఫోటోలను అతను డిలీట్ చేశాడు.
కానీ, అప్పటికే సదరు మహిళ కొన్ని ఫోటోలను స్క్రీన్ షార్ట్స్ తీసి పెట్టింది. అనంతరం దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు క్యాబ్ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.