టీచర్ రిక్రూట్ మెంట్ స్కామ్ లో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో పశ్చిమ బెంగాల్ లో టీఎంసీకి చెందిన మరో ఎమ్మెల్యేను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అంతకు ముందు ఆయనను ప్రశ్నించారు. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ ఎమ్మెల్యే, పశ్చిమ బెంగాల్ ప్రాథమిక విద్యా మండలి మాజీ అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్యను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం అధికారికంగా అరెస్టు చేసింది. టీచ‌ర్ రిక్రూట్‌మెంట్ స్కామ్ లో ద‌ర్యాప్తులో భాగంగా ఆయ‌న‌ను రాత్రంతా ప్రశ్నించిన ఏజెన్సీ త‌రువాత అరెస్టు చేసింది.

జైలు శిక్ష అనుభ‌విస్తున్న వేర్పాటువాద నాయ‌కుడు అల్తాఫ్ అహ్మద్ షా మృతి..

రాష్ట్ర ప్రాథమిక విద్యా మండలి మాజీ ఛైర్మన్‌గా ఉన్న ఆయనను కలకత్తా హైకోర్టు జూన్‌లో తన పదవి నుంచి తొలగించింది. టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి పార్థ ఛటర్జీ తర్వాత అరెస్టయిన రెండో ఉన్న‌త స్థాయి టీఎంసీ ఎమ్మెల్యే ఆయ‌న‌. రాష్ట్ర ప్రైమరీ టీచర్ల నియామకానికి సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో జరిగిన అవకతవకలకు సంబంధించి భట్టాచార్యపై సీబీఐ ఆగస్టులో లుకౌట్ నోటీసు జారీ చేసింది.

ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పు..సగం కాలిన తరువాత..

ఈ స్కామ్‌లో భట్టాచార్య పేరు బయటకు వచ్చిన వెంటనే, ఆయ‌న‌కు ఇకపై పోలీసు భద్రత కల్పించనున్నట్లు రాష్ట్ర పోలీసులు తెలిపారు. టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో విస్తృతంగా అవినీతి జరిగిందనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ చైర్మన్ పదవి నుండి భట్టాచార్యను తొలగించాలని కలకత్తా హైకోర్టు గతంలోనే ఆదేశించింది.

 ఆ తర్వాత భట్టాచార్యను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యుబీఎస్‌ఎస్‌సీ) రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో అప్పటి విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ, అతడి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఛటర్జీ, ముఖర్జీలను అరెస్టు చేసిన తర్వాత, ఈడీ కూడా భట్టాచార్యను విచారణకు పిలిచింది.

సగం తిన్నాక సమోసాలో పచ్చకాగితం.. రైల్వే క్యాంటీన్ నిర్వాకం, ట్వీట్ చేస్తే ఐఆర్సీటీసీ క్షమాపణలు..

ఈ కుంభకోణానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ) మాజీ సలహాదారు శాంతి ప్రసాద్ సిన్హా, డబ్ల్యుబీఎస్‌ఎస్‌సీ మాజీ ఛైర్మన్ అశోక్ సాహా, డబ్ల్యుబీఎస్‌ఎస్‌సీ మాజీ అధ్యక్షుడు కళ్యాణ్‌మోయ్ గంగూలీలను సీబీఐ అరెస్టు చేసింది.