Asianet News TeluguAsianet News Telugu

ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పు..సగం కాలిన తరువాత..

ఓ యేడేళ్ల చిన్నారిని తీసుకువెళ్లిన 19యేళ్ల యువకుడు.. బాలిక మీద అత్యాచారం చేసి, హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహం మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 

7-year-old brutally killed after sexual abuse in Haryana
Author
First Published Oct 11, 2022, 7:22 AM IST

హర్యానా : హర్యానాలోని కైతల్ జిల్లాలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. హతమార్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింద. గత ఆదివారం తమ ఏడేళ్ల చిన్నారి కనిపించడం లేదని.. కుటుంబ సభ్యులు కైతల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. చుట్టు పక్కల గాలింపు చర్యలు చేపట్టగా.. సగం కాలి ఉన్న చిన్నారి మృతదేహం అటవీ ప్రాంతంలో బయటపడింది. తప్పిపోయిన చిన్నారి 19యేళ్ల యువకుడితో ఎక్కడితో వెడుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. 

ఆ యువకుడిని విచారించగా.. బాలికను ప్రలోభపెట్టి తన వెంట తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడించాడు. చిన్నారి గట్టిగా అరవడం వల్ల.. దొరికిపోతాననే భయంతో బాలిక ముఖం మీద గట్టిగా నొక్కి చంపి మృతదేహం మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

సగం తిన్నాక సమోసాలో పచ్చకాగితం.. రైల్వే క్యాంటీన్ నిర్వాకం, ట్వీట్ చేస్తే ఐఆర్సీటీసీ క్షమాపణలు..

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఆగస్ట్ లో ముంబైలో వెలుగుచూసింది. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు  తేజస్ దల్వీ (24)ని పూణే జిల్లా పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు. సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించిన తేజస్  తల్లి సుజాత దల్వీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత స్థానికులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ కోఠార్ణే గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అదనంగా పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెడితే... పూణే జిల్లా మావళ్ తాలూకా కోఠార్ణే గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక ఆగస్ట్ నెల రెండో తేదీన కనిపించకుండా పోయింది. 

తల్లిదండ్రులు ఊరంతా గాలించినా బాలిక ఆచూకీ లభించలేదు. చివరకు బాలిక తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కూడా తమదైన శైలిలో వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. చివరకు బుధవారం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల వెనకాల నగ్న స్థితిలో ఉన్న బాలిక మృతదేహం లభించింది. ఈ వార్త దావానలంలా ఊరంతా పాకింది. విషయం తెలియడంతో పెద్దసంఖ్యలో గ్రామస్తులు గుమిగూడారు. పోలీసులు వెంటనే శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోస్ట్ మార్టం రిపోర్టులో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 

గ్రామస్తులు ఆగ్రహాన్ని చూసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి 24 గంటల్లోనే కామాంధుడు తేజస్ దల్వీని అరెస్టు చేసినట్లు సీనియర్ ఇన్స్పెక్టర్ అశోక్ శల్కే వెల్లడించారు. ఆతర్వాత చేపట్టిన విచారణలో తేజస్ నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు బాలిక ఉంటున్న పక్క ఇంట్లోనే నివాసం ఉంటున్నట్లు తెలిసింది. నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలియగానే మావళ్ తాలూకా హద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలు అందరూ కోఠార్ణే గ్రామానికి  తరలివచ్చారు. 

అంతటితో ఊరుకోకుండా నిందితుడిని ఉరి తీయాలంటూ విద్యార్థులు, మహిళా సంఘాలు, స్థానికులు మోర్ఛా నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మహిళా కమిషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణ  ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా జరిపించి నిందితుడిని వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios