వేర్పాటువాద నాయకుడు అల్తాఫ్ అహ్మద్ షా అనారోగ్యంతో చనిపోయారు. ఆయన 2017 లో అరెస్టు అయ్యారు. అప్పటి నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 

2017లో అరెస్టయిన కాశ్మీర్ వేర్పాటువాద కార్యకర్త అల్తాఫ్ అహ్మద్ షా సోమవారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఖైదీగా కన్నుమూశారు. కిడ్నీ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయ‌న చికిత్స కోసం ఈ నెల ప్రారంభంలో ఎయిమ్స్‌లో చేరారు. అక్క‌డ చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించ‌డంతో చ‌నిపోయారు. అహ్మ‌ద్ షా మ‌ర‌ణవార్త‌ను కుమార్తె రువా షా ధృవీక‌రించారు. ‘‘ అబు న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో ఖైదీగా తుది శ్వాస విడిచాడు ’’ అని ట్వీట్ చేశారు. 

ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పు..సగం కాలిన తరువాత..

శ్రీనగర్‌లోని సౌరా నివాసి, షా దివంగత హురియత్ ఛైర్మన్, వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీకి అల్తాఫ్ అహ్మద్ షా అల్లుడు. ఆయ‌న సన్నిహితులలో ఒకరు. అతను 2004లో గిలానీ స్థాపించిన తెహ్రీక్-ఎ-హురియత్‌తో కూడా సంబంధం కలిగి ఉన్నాడు. 2017 సంవత్సరంలో తీవ్రవాద నిధుల ఆరోపణలపై అరెస్టయ్యాడు. తీహార్ జైలులో బంధీగా ఉన్నారు. కొంత కాలం నుంచి ఆయ‌న మూత్రపిండ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.

Scroll to load tweet…

అయితే త‌న తండ్రికి ఆరోగ్యం బాగా లేదని, తక్షణమే వైద్యం అందించాలని గత ఆరు నెలలుగా నిత్యం అధికారుల‌కు విజ్ఞప్తులు చేస్తూనే ఉంది. తన తండ్రికి తక్షణ వైద్య సహాయం అందించాలని, మానవతా దృక్పథంతో బెయిల్ ఇప్పించాలని రువా ప్రధాని నరేంద్ర మోదీకి , హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.

Scroll to load tweet…

కాగా.. షాను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాలని ఢిల్లీ హైకోర్టు అక్టోబర్ 1న ఆదేశించింది. దీంతో కొద్ది రోజుల కింద‌టే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అతడి కొడుకు లేదా కుమార్తె ప్రతిరోజూ ఒక గంట తనను కలిసేందుకు అనుమతిస్తూ కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

త‌మిళ‌నాడులో దీపావళి క్రాకర్స్ పేల్చడంపై ఆంక్షలు

అల్తాఫ్ అహ్మద్ షాకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే అత‌డి పెద్ద కుమారుడు అనీస్ ఉల్ ఇస్లాం అక్టోబర్ 2021లో సెక్షన్ 311 (2) (సి) ప్రకారం ‘‘రాష్ట్ర భద్రతకు ముప్పు’’గా ఉన్నార‌నే కార‌ణంతో త‌న ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయాడు.