ఢిల్లీ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విద్యుత్ నేటి నుంచి ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని పొడగిచేందుకు ఢిల్లీ ప్రభుత్వం పంపించిన ఫైల్ ను లెఫ్టినెంట్ గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎల్జీపై విమర్శలు చేసింది. 

ఢిల్లీలో విద్యుత్ వినియోగదారులకు సబ్సిడీని విస్తరించే ఫైలును లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇంకా ఆమోదించలేదని ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అతిషి తెలిపారు. దీంతో నగరంలోని దాదాపు 46 లక్షల మందికి విద్యుత్ సబ్సిడీ శుక్రవారం నుంచి ఆగిపోతుందని చెప్పారు. నగర ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి మధ్య తాజా వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ విషయంపై సక్సేనాతో సమావేశం కావాలని కోరినా స్పందన లేదని మంత్రి తెలిపారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కేజీఎఫ్ బాబు భార్య పోటీ.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు.. వీరెవరంటే ?

46 లక్షల మందికి ఇస్తున్న సబ్సిడీ నేటి నుంచి ఆగిపోతుందన్నారు. సోమవారం నుంచి ప్రజలకు సబ్సిడీ లేకుండా బిల్లులు వస్తాయన్నారు.  2023-24 సంవత్సరానికి విద్యుత్ సబ్సిడీ పొడిగింపునకు ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపిందని, అయితే ఫైల్ ఇంకా ఎల్జీ కార్యాలయంలో పెండింగ్ లో ఉందని మంత్రి తెలిపారు.

‘‘ ఫైలు ఆమోదం పొందే వరకు సబ్సిడీ ఇవ్వలేం. ఈ విషయంపై చర్చించడానికి నేను ఎల్జీ కార్యాలయలో సమయం అడిగాను. ఒక రోజు గడిచింది. కానీ ఇంకా నాకు సమయం ఇవ్వలేదు. ఫైల్ కూడా ఇంకా తిరిగి రాలేదు ’’ అని అతిషి చెప్పారు. కొద్ది రోజుల కిందటే ఫైల్ పంపించామని, అయినా ఇంకా స్పందన రావాల్సి ఉందని చెప్పారు. ఈ సబ్సిడీకి సంబంధించిన బడ్జెట్ ను విధానసభ ఆమోదించింది. సబ్సిడీ కోసం ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నాయని, కానీ ఖర్చు చేయలేమని చెప్పారు.

అధికారాన్ని దుర్వినియోగం చేసి, భారతీయులను విభజించేవారే నిజమైన దేశ ద్రోహులు - సోనియా గాంధీ

ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందిస్తున్న విషయం తెలిసిందే.  అయితే 201 నుంచి 400 యూనిట్లు వినియోగించే వారికి 50 శాతం సబ్సిడీ ఇస్తోంది. దీని కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు మాత్రమే విద్యుత్ సబ్సిడీ ఇస్తామని గత ఏడాది ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

Scroll to load tweet…

అధికారిక లెక్కల ప్రకారం 58 లక్షలకు పైగా గృహ వినియోగదారుల్లో 48 లక్షల మంది విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీని కోసం 2023-24 బడ్జెట్ లో విద్యుత్ సబ్సిడీ కోసం ఢిల్లీ ప్రభుత్వం రూ.3250 కోట్లు కేటాయించింది.

నాగాలాండ్ కాల్పుల ఘటన.. 30 మంది సైనికుల విచారణకు అనుమతి నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం..

కాగా.. ఆప్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా స్పందించారు. గత ఆరేళ్లలో ప్రైవేటు డిస్కమ్లకు ఇచ్చిన రూ.13,549 కోట్లపై ఆడిట్ నిర్వహించడంలో కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. పేదలకు విద్యుత్ సబ్సిడీని అందించడాన్ని వినయ్ కుమార్ సక్సేనా సమర్థించారని, నిధుల దుర్వినియోగాన్ని నివారించడానికి డిస్కమ్ లకు ఇచ్చే నిధులను ఆడిట్ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో నొక్కి చెప్పింది. కాగ్ ఎంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) ఆడిట్ కు ప్రత్యామ్నాయంగా కాగ్-ఎంపానెల్ ఆడిటర్ల ఆడిట్ ను పరిగణించలేమని పేర్కొంది.