కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓ కోటీశ్వరుడి భార్య స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. పెద్ద వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన ఆయనను స్థానికంగా కేజీఎఫ్ బాబు అని పిలుస్తారు. అయితే ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో భార్యను పోటీ చేయిస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రతీ రోజూ వార్తల్లో నిలుస్తున్నాయి. బీజేపీ నుంచి ముఖ్యమైన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే.. మరి కొందరు నేతలు కాంగ్రెస్ ను వీడుతున్నారు. దీంతో వారంతా స్వతంత్ర అభ్యర్థులగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించిన ఓ కోటీశ్వరుడు ఇప్పుడు తన భార్య కోరుకున్న స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సవాల్ విసురుతున్నాడు.
అధికారాన్ని దుర్వినియోగం చేసి, భారతీయులను విభజించేవారే నిజమైన దేశ ద్రోహులు - సోనియా గాంధీ
కేజీఎఫ్ ప్రాంతానికి చెందిన వ్యాపారి యూసుఫ్ షరీఫ్ అలియాస్ కేజీఎఫ్ బాబు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చిక్ పేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. రెండేళ్ల కిందట కూడా అదే పార్టీ తరుఫున ఎమ్మెల్సీ గా బరిలోకి దిగాడు. అయితే అందులోనూ ఆయన ఓడిపోయాడు. కాగా.. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో అందించిన అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ రూ.1743 కోట్లుగా ప్రకటించి సంచలనం సృష్టించారు.
నాగాలాండ్ కాల్పుల ఘటన.. 30 మంది సైనికుల విచారణకు అనుమతి నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం..
అతడు ప్రకటించిన ఆస్తుల కంటే ఇంకా ఎక్కువగానే ఆస్తులు ఉన్నాయని బీజేపీ ఆ సమయంలో ఆరోపించింది. కానీ ఆ ఎన్నికల్లో కేజీఎఫ్ బాబు ఓడిపోవడంతో ఆ అంశం మరుగున పడిపోయింది. అయితే ఈసారి మళ్లీ కాంగ్రెస్ తరుఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అతడు భావించాడు. కానీ ఆ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో కేజీఎఫ్ బాబు తన భార్య షాజియా తరన్నమ్‌ను అదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దింపారు. అంతేకాదు ఆమెతో వెంటనే నామినేషన్ కూడా వేయించారు.
రెండు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కేజీఎఫ్ బాబు.. ఈ సారి తన భార్యను గెలిపించుకునేందుకు సీరియస్ గా ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ బాబు భార్య పోటీ ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
