ఓ బస్సు వెనకాల నుంచి బైక్ ను ఢీకొట్టిన ఘటనలో పోలీస్ ఇన్ స్పెక్టర్ మరణించాడు. తన అధికారిక నివాసం నుంచి విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఓ బస్సు వేగంగా వెళ్తూ వెనకలా నుంచి బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న పోలీస్ ఇన్ స్పెక్టర్ కింద పడి తీవ్ర గాయాలతో మరణించాడు. ఈ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని మంబైలో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ అశోక్ దినకర్ (43) శాంతాక్రూజ్ ఈస్ట్‌లోని కోల్ కళ్యాణ్‌లోని తన అధికారిక నివాసం నుండి శుక్రవారం విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్నాడు. ఉదయం 9 గంటల సమయంలో నెహ్రూ రోడ్డులోని న్యూ మోడరన్ స్కూల్ సమీపంలోకి చేరుకున్నారు. ఇదే సమయంలో సియోన్ లోని ప్రతీక్ష నగర్ నుంచి అంధేరిలోని మరోల్ వైపు ఓ బస్సు వేగంగా వెళ్తోంది. ప్రవీణ్ అశోక్ దినకర్ ప్రయాణిస్తున్న బైక్ ను ఈ బస్సు న్యూ మోడరన్ స్కూల్ సమీపంలో వేగంగా వెనకాల నుంచి ఢీకొట్టింది.
దీంతో ఇన్‌స్పెక్టర్ రోడ్డుపై పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన ఆయనను వీఎన్ దేశాయ్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బస్సు డ్రైవర్ (35)ను అరెస్టు చేసినట్లు వకోలా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. జాయింట్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) సత్య నారాయణ్ సహా సీనియర్ అధికారులు ఆసుపత్రిని సందర్శించారని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని వకోలా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
