ఒడిశా సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ లో  దారుణం జరిగింది. విధులు నిర్వహిస్తున్న ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ను వేటగాళ్లు కాల్చి చంపారు. విధులు ఉన్న సమయంలో అతడిపై కాల్పులు జరిగాయి. అయితే హాస్పిటల్ కు తరలించినప్పటికీ పరిస్థితి విషమించి ఆయన మరణించాడు. 

సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీ అధికారిని శుక్రవారం రాత్రి వేటగాళ్లు కాల్చి చంపారు. ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ను మతి హన్స్దా గా అధికారులు గుర్తించారు. మయూర్ భంజ్ జిల్లాలోని 2,700 చదరపు కిలోమీటర్ల సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో భాగమైన ఎగువ బారాకుముడా రేంజ్ లోని గమ్చచరణ్ బీట్ క్యాంప్ సమీపంలో మతి హన్స్దా అనే గిరిజన ఫారెస్ట్. ఇతర అటవీ అధికారులతో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పాపం.. ఫుడ్ డెలివరీ బాయ్ పై బాలిక తప్పుడు ఫిర్యాదు, చితకబాదిన స్థానికులు.. సీసీ టీవీ ఫుటేజీలో నిజం వెలుగులోకి

అయితే శనివారం వేకువజామున 1.30 గంటల సమయంలో హన్స్దా, ఇతర అటవీ అధికారులు రేంజ్ లోపల వేటగాళ్ల బృందాన్ని అడ్డుకున్నారని, వారు ఆయుధాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించగా, వేటగాళ్లలో ఒకరు అతన్ని కాల్చి చంపారని అధికారులు తెలిపారు.

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు సుఖేష్ చంద్రశేఖర్ రూ.10 కోట్ల విరాళం.. చట్టబద్ధంగా సంపాదించానని, స్వీకరించాలని లేఖ

‘‘ఈ ఘటన గంచచరణ్ బీట్ క్యాంప్ సమీపంలో చోటుచేసుకుంది. ఆరుగురు సభ్యుల అటవీ బృందం పెట్రోలింగ్ చేస్తుండగా వేటగాళ్ల గుంపు కనిపించింది. మా సిబ్బంది వారిని అడ్డుకున్నారు మరియు వేటగాళ్ళలో ఒకరు హన్స్దాను గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన అతడిని కరంజియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశాం’’ డిప్యూటీ డైరెక్టర్ (సిమిలిపాల్ నార్త్ డివిజన్) సాయికిరణ్ తెలిపారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-డంపర్ ఢీ.. ముగ్గురు మృతి.. ఏడుగురికి గాయాలు

ఒక అటవీ అధికారిని వేటగాళ్లు చంపడం నెల రోజుల్లో ఇది రెండోసారి అని అధికారులు తెలిపారు. మే 22 సాయంత్రం ఫారెస్ట్ గార్డు బిమల్ కుమార్ జెనాను టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో 26 మంది వేటగాళ్ల బృందం కాల్చి చంపిందని చెప్పారు.