ప్యాసింజర్ బస్సు - డంపర్ ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. మరో ఏడుగురికి తీవ్ర గాాయాలు అయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని దేవ్ పూరి బాబా ప్రాంతంలో చోటు చేసుకుంది. క్షతగాత్రులు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
మధ్యప్రదేశ్ లోని మొరెనా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్యాసింజర్ బస్సు-డంపర్ ను ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. మరో 7 గురికి గాయాలు అయ్యాయి. గ్వాలియర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్యాసింజర్ బస్సు దేవ్ పూరి బాబా ప్రాంతానికి చేరుకునే సరికి ఓ డంపర్ ను ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. ‘‘గ్వాలియర్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా డంపర్, ప్యాసింజర్ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాం’’ అని మొరేనా ఎస్పీ శైలేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వారం ప్రారంభంలో కూడా ముంబై-నాగ్ పూర్ సమృద్ధి ఎక్స్ ప్రెస్ వే నాసిక్ మార్గంలో జరిగిన కారు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. జిల్లాలోని సనన్ర్ తాలూకా ఖంబాలే శివార్ లో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబై నుంచి షిర్డీ వెళ్తున్న టయోటా కారు టైర్ పేలడంతో డ్రైవర్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టాడని పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. మృతులను రజాక్ అహ్మద్ షేక్ (55), సత్తార్ షేక్ లాలా షేక్ (65), సుల్తానా సత్తార్ షేక్ (50), ఫయాజ్ దగుభాయ్ షేక్ (40)గా గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఫయాజ్ సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
