ఓ ఫుడ్ డెలివరీ బాయ్ తనను బలవంతంగా మేడపైకి తీసుకెళ్లాడని ఎనిమిదేళ్ల బాలిక తల్లిదండ్రులకు అబద్దం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు, స్థానికులు కలిసి అతడిని చితకబాదారు. అయితే పోలీసులు వచ్చి సిసీ ఫుటేజీని పరిశీలించగా బాలిక అబద్దం చెప్పిందని తేలింది.
ఓ ఫుడ్ డెలివరీ బాయ్ పై ఎనిమిదేళ్ల బాలిక తప్పుడు ఫిర్యాదు చేసింది. తనను అతడు బలవంతంగా మేడపైకి తీసుకున్నాడని బాలిక ఆరోపించింది. దీంతో స్థానికులు, అతడిని చితకబాదారు. తరువాత సీసీ ఫుటేజీ పరిశీలిస్తే.. బాలిక అబద్దం చెప్పిందని తేలింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకుంది.
ఇలా చేస్తే దేశంలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తాయి - బీజేపీకి తమిళనాడు సీఎం స్టాలిన్ వార్నింగ్
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీ ప్రాంతంలో గురువారం ఓ బాలిక కనిపించకుండా పోయింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు కంగారు పడ్డారు. దీంతో ఆమె కోసం గాలించారు. అయితే ఆమెను వెతుక్కుంటూ తల్లిదండ్రులు మేడపైకి చేరుకున్నారు. అక్కడ బాలిక ఒంటరిగా కనిపించింది. ఇక్కడేం చేస్తున్నావని తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించారు. దీంతో ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ తనను బలవంతంగా ఇక్కడికి తీసుకెళ్లాడని పేర్కొంది. తప్పించుకునేందుకు అతడి చేతిని కొరికానని పేర్కొంది.
దీంతో ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు వెంటనే సెక్యూరిటీ గార్డులను పిలిపించి అపార్ట్ మెంట్ గేట్లు మూసివేశారు. దీంతో ఆ బాలిక క్యాంపస్ లో ఉన్న ఓ డెలివరీ ఏజెంట్ వైపు చేయి చూపింది. దీనిపై ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ పోలీసులు వచ్చేలోపే వారు ఆ వ్యక్తిని చితకబాదారు. అనంతరం సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. అయితే బాలిక ఒంటరిగానే అక్కడికి వెళ్లిందని గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు ఆ డెలివరీ బాయ్ కు క్షమాపణలు చెప్పినట్టు సమాచారం.
ఈ విషయంలో డెలివరీ బాయ్ బాధపడ్డారు.. ‘‘ ఆ బాలిక తల్లిదండ్రులతో పాటు వచ్చిన ప్రతీ వ్యక్తి, సెక్యూరిటీ గార్డులతో కలిసి నన్ను కొట్టారు. ఆమె ఈ తప్పుడు ఆరోపణ ఎందుకు చేసిందో తెలియదా ’’ అని ప్రశ్నించారు. ‘‘నన్ను కాపాడిన సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసిన ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీసులకు ధన్యవాదాలు. సీసీ కెమెరాలు లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో అనే విషయం తెలుసుకుంటేనే ఆందోళనగా ఉంది’’ అని అన్నారు. కాగా.. తాను కోలుకోవడానికి మేనేజర్ అనారోగ్య సెలవులు ఇచ్చారని తెలిపాడు.
ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-డంపర్ ఢీ.. ముగ్గురు మృతి.. ఏడుగురికి గాయాలు
అయితే ఈ ఎందుకు అబద్దం చెప్పావని పోలీసులు బాలికను ప్రశ్నించగా.. క్లాసులు ఉన్న సమయంలో మేడపైన ఆడుకుంటున్నందుకు తన తల్లిదండ్రులు కొడతారేమో అనే భయంతో ఇలా డెలివరీ బాయ్ పేరు చెప్పానని తెలిపింది. ఈ ఘటనపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ఈ విషయంలో ఆ డెలివరీ బాయ్ కు తగిన రక్షణ, న్యాయం జరిగేలా చూడాలని కర్ణాటక సీఎంను కోరారు.
