Asianet News TeluguAsianet News Telugu

అస్సాంలో దారుణం.. మైన‌ర్ బాలిక‌పై గ్యాంగ్ రేప్.. ముగ్గురి అరెస్ట్..

అస్సాంలో మైనర్ బాాలికపై గ్యాంగ్ ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Atrocity in Assam.. Gang rape of a minor girl.. Three arrested..
Author
First Published Oct 5, 2022, 11:32 AM IST

అస్సాంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైన‌ర్ బాలిక‌పై ముగ్గురు యువ‌కులు గ్యాంగ్ రేప్ కు పాల్ప‌డ్డారు. బాలిక ప్ర‌తిఘటించ‌డానికి ప్ర‌య‌త్నించింది. దీంతో ఆమెపై దుండ‌గులు దాడి చేశారు. తీవ్ర గాయాల‌పాలైన బాధితురాల‌ని స్థానికులు హాస్పిట‌ల్ లో చేర్చారు. లైంగిక దాడికి పాల్ప‌డిన నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన పెళ్లి బృందం బస్సు.. 32కు పెరిగిన మృతుల సంఖ్య

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. గోల్‌పరా జిల్లాలో అగియా పోలీస్ స్టేషన్ పరిధిలోని గదర్‌బోరి ప్రాంతంలో 15 ఏళ్ల బాలిక మాధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వ‌స్తోంది. సుమారు 2.30 గంట‌ల స‌మ‌యంలో ఆమెను ముగ్గురు యువ‌కులు ఆమెను అడ్డుకున్నారు. రోడ్డు ప‌క్క‌న ఉన్న అడ‌వికి తీసుకెళ్లారు. అనంత‌రం ఆమెపై లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. 

ముంబ‌యిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదురుగు స్పాట్ డెడ్.. 12 మందికి తీవ్ర‌ గాయాలు

లైంగిక దాడికి పాల్ప‌డే స‌మ‌యంలో బాలిక దుండ‌గులకు ఎదురు తిరిగింది. వారిని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించింది. దీంతో కోపంతో ఆ దుండ‌గులు ఆమెను కొట్టారు. ఈ ఘ‌ట‌న త‌రువాత ఆమెను ప‌లువురు హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. అక్క‌డ చికిత్స స‌మ‌యంలో బాలిక‌ ప్రైవేట్ భాగాలపై గాయాలు క‌నిపించాయ‌ని డాక్ట‌ర్లు చెప్పార‌ని పోలీసు అధికారులు తెలిపారు. ‘‘ మైనర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించామని, బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశామని పేర్కొన్నారు. 

గ‌ర్భా ఆడుతుండ‌గా రాళ్ల‌తో దాడి.. ఆక‌తాయిల‌ను పోల్ కు క‌ట్టేసి కొట్టిన పోలీసులు.. వైర‌ల్ అవుతున్న వీడియో

ఈ ఘ‌ట‌న‌పై బాలిక కుటుంబ సభ్యులు అజియా పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై ఐపీసీ, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ఇలాంటి ఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ముజఫర్‌పూర్‌లోని ఔరాయ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దుర్గాపూజ చూసి తిరిగి ఇంటికి వస్తున్న మైనర్‌ బాలికపై నలుగురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. కేసు న‌మోదుచేసుకునీ, అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం త్వరితగతిన చర్యలు తీసుకున్న పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios