Asianet News TeluguAsianet News Telugu

గ‌ర్భా ఆడుతుండ‌గా రాళ్ల‌తో దాడి.. ఆక‌తాయిల‌ను పోల్ కు క‌ట్టేసి కొట్టిన పోలీసులు.. వైర‌ల్ అవుతున్న వీడియో

గుజరాత్ లో గర్భా ఆడుతున్న మహిళలపై రాళ్లు రువ్విన ఆకతాయిల పనిపట్టారు అక్కడి లోకల్ పోలీసులు. కరెంట్ పోల్ కు కట్టేసి చితకబాదారు. పోలీసుల చర్యను సోషల్ మీడియాలో కొందరు సమర్థిస్తుండగా.. మరి కొందరు విమర్శిస్తున్నారు. 

Attacked with stones while pregnant. Police tied hooligans to a pole and beat them. Video going viral.
Author
First Published Oct 5, 2022, 8:56 AM IST

ద‌స‌రా న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా గ‌ర్భా ఆడుతున్న మ‌హిళ‌లపై కొంద‌రు ఆకతాయిలు రాళ్లు రువ్వారు. వాళ్ల ఆనందాన్ని చెడ‌గొట్టారు. పైశాచిక ఆనందం పొందారు. దీంతో పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. ఆ ఆకాతాయిల‌ను గుర్తించి ప‌ట్టుకున్నారు. అక్క‌డే వారిని క‌రెంట్ పోల్ కు క‌ట్టేసి చిత‌క‌బాదారు. మ‌హిళ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పించారు. ఈ వీడియోను స్థానికులు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది ఇప్పుడు వైర‌ల్ మారింది. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్ లో చోటు చేసుకుంది. 

పౌరీ గర్వాల్ బస్సు ప్రమాదం.. ఇప్ప‌టి వ‌ర‌కు 16 మందిని రక్షించిన సిబ్బంది

గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఉండెల గ్రామంలోని దేవాలయం ఆవరణలో గర్బా ఆడుతున్న మ‌హిళ‌ల‌పై దాదాపు 150 మంది గుంపు రాళ్లు రువ్వింద‌ని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. ఆ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌కుండా చూడాల‌ని ఆకతాయిలు భావించారు. వెంట‌నే అక్క‌డికి పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు. 

నన్ను బరిలో నుంచి త‌ప్పించ‌డానికి రాహుల్‌పై ఒత్తిడి.. శ‌శి థ‌రూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నిందితుల్లో కొంద‌రిని పోలీసులు ప‌ట్టుకున్నారు. ఆ స‌మ‌యంలో అందులో ఎవ‌రూ యూనిఫాం ధ‌రించి లేరు. కానీ ఒక పోలీసు మాత్రం త‌న బెల్ట్ కు గ‌న్ పెట్టుకొని ఉండ‌టం వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఆకతాయిల్లో ఒక్కొక్క‌రిని తీసుకొని వ‌చ్చి క‌రెంట్ పోల్ ద‌గ్గ‌ర నిల‌బెట్టారు. వారి చేతుల‌ను ఒక‌రిద్ద‌రు పోలీసులు పట్టుకోగా.. మ‌రో పోలీసు క‌ర్ర‌తో కొడుతున్నాడు. త‌రువాత అక్క‌డున్న మ‌హిళ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పించారు. 

నిందితుల‌ను పోలీసులు చిత‌కబాదుతున్న వీడియోను స్థానికులు వీడియో తీశారు. దీనిని బీజేపీ నాయ‌కులు, ఆ గ్రామ‌స్తులు సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇది ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. పోలీసులు ఆక‌తాయిల‌ను కొడుతుండ‌గా ఆ గ్రామ‌స్తులు, పిల్ల‌లు చూస్తుండ‌టం క‌నిపిస్తోంది. వారిని కొట్టినప్పుడు ఎంతో ఆనందం వ్య‌క్తం చేశారు. అయితే పోలీసులు ఆక‌తాయిల‌ను కొడుతున్న వీడియో క్లిప్ ఏదీ తనకు కనిపించలేదని అహ్మదాబాద్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ వీ చంద్రశేఖర్ చెప్పారు. పోలీసుల చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపిస్తామ‌ని తెలిపారు. 

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. వధువు ఇంటికి ఊరేగింపుగా వెళ్తుండగా.. లోయ‌లో ప‌డ్డ బ‌స్సు.. 25 మంది మృతి

గ‌ర్భా వేధిక‌పై రాళ్లు రువ్విన ఘ‌ట‌నలో మాటర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదు అయ్యింది. పోలీసులు 13 మందిని అదుపులోకి తీసుకున్నారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీఆర్ బాజ్‌పాయ్ తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. ‘‘ గ్రామ సర్పంచ్ (పెద్ద) ఒక ఆలయం వద్ద గర్బా నిర్వహించారు. ఓ వర్గానికి చెందిన గుంపు దానిని జరగకుండా ఆపడానికి ప్రయత్నించింది ’’ అని ఆయన మీడియాతో తెలిపారు. 150 మంది వరకు గర్భా బృందంపై దాడి చేసింద‌ని, ఇందులో 43 మందిని పేర్లతో పాటు గుర్తించి ఎఫ్ఐఆర్ న‌మోదు చేశామ‌ని పోలీసు అధికారులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios