రైలు ఎక్కుతున్న ఆర్మీ జవాన్ ను ఓ టీటీఈని కిందికి తోసేశాడు. దీంతో ఆయన కదులుతున్న రైలు నుంచి కింద పడిపోయాడు. ప్రస్తుతం సైనికుడి పరిస్థితి విషమంగా ఉంది. 

యూపీలో దారుణం జరిగింది. రైలు కదులుతుండగా ఎక్కబోయిన ఇండియన్ ఆర్మీ సైనికుడిని టీటీఈ కిందికి తోసేశాడు. దీంతో అతడి కాలును కోల్పోయాడు. ప్రస్తుతం హాస్పిటల్ లో ఆయన చికిత్స పొందుతున్నా.. పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి.

చదువుకున్న అమ్మాయిలు అలాంటి సంబంధాల్లోకి రావద్దు.. కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

రాజధాని ఎక్స్‌ప్రెస్ (20503) దిబ్రూగఢ్ నుండి న్యూఢిల్లీకి గురువారం వెళ్తోంది. ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి జంక్షన్ లోని ప్లాట్‌ఫారమ్‌ నంబర్‌ 2 చేరుకుంది. అయితే ఇదే రైలుతో బల్లియాలోని హల్దీ పోలీస్ స్టేషన్‌కు చెందిన భర్సోటా గ్రామానికి చెందిన ఇండియన్ ఆర్మీ సైనికుడు జవాన్ సోను కుమార్ (30) ఉన్నాడు. ఆయన లక్నో నుండి ఢిల్లీకి వెళ్లేందుకు థర్డ్ ఏసీ కోచ్‌లో ఎక్కాడు. జవాన్ నీరు కోసం బరేలీ జంక్షన్‌లో దిగాడు. కొంతసేపటికి రైలు బయలుదేరింది. అయితే రైలు కదిలే సమయంలో కోచ్ ఎక్కుతుండగా టీటీఈతో వాగ్వాదం జరిగింది.

మిస్టరీ : చంద్రగ్రహణం తరువాత.. ప్రతీరోజూ రాత్రీ ఆ ఇంట్లో మంటలు.. కరెంట్ లేకున్నా షార్ట్ సర్క్యూట్...!!

దీంతో టీటీఈ సోనును కదులుతున్న రైలు నుంచి తోసేశారు. దీంతో ఆయన కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతడి కాలు తెగిపోయింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న రైల్లో ఉన్న ఇతర ఆర్మీ సిబ్బంది రైలు నుంచి కిందకు దిగారు. ఆగ్రమంతో టీటీఈని చితకబాదారు. అడ్డుకునేందుకు వచ్చిన మరో టీటీఈని కూడా కొట్టారు.

మా అంకుల్ రేప్ చేశాడు, తాతయ్య వేధించాడు.. ఇది తెలిసి నాన్న కూడా అత్యాచారం చేశాడు...బాలిక ఆవేదన..

ఘటన అనంతరం టీటీఈ అక్కడి నుంచి పారిపోయాడు. తన మొబైల్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకుననాడు. ప్రమాదంలో గాయపడిన సైనికుడిని సహచరులు ఆర్మీ హాస్పిటల్ లో చేర్పించారు. సైనికుడిని తోసేసిన వార్త తెలియగానే, జీఆర్పీ, ఆర్పీఎఫ్ తో పాటు రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న ఆర్మీ పోలీస్ లెఫ్టినెంట్ కల్నల్ విజయ్ తన్వర్, MCO లెఫ్టినెంట్ కల్నల్ అజయ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవ పడుతున్న జవాన్లను శాంతింపజేశారు. అనంతరం రైల్వే అధికారులు గంట ఆలస్యంగా రైలును గమ్యస్థానానికి పంపించారు.

Gujarat election: ఎన్నికలకు ముందు గుజరాత్ పర్యటనకు రాహుల్ గాంధీ

బరేలీ జంక్షన్‌లోని ఎంసీఓ కార్యాలయం అధికారులు ఆర్మీ కంట్రోల్ రూమ్‌కు ఈ ఘటన సమాచారం అందించారు. కొద్దిసేపటికే ఆర్మీ బెటాలియన్ బరేలీ జంక్షన్ చేరుకుంది. చాలా మంది బ్రిగేడియర్లు, లెఫ్టినెంట్లు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆర్మీ అధికారులు ప్లాట్‌ఫారమ్‌లోనే గాయపడిన జవాన్ సోనూ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. వెంటనే అతడిని మిలిటరీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.