మిస్టరీ : చంద్రగ్రహణం తరువాత.. ప్రతీరోజూ రాత్రీ ఆ ఇంట్లో మంటలు.. కరెంట్ లేకున్నా షార్ట్ సర్క్యూట్...!!
దీపావళినాడు వచ్చిన చంద్రగ్రహణం తరువాత ఓ ఇంట్లో ప్రతీరోజు రాత్రి అగ్ని ప్రమాదం జరుగుతోంది. ఉన్నట్టుండి మంటలు అంటుకుంటున్నాయి.
ఉత్తరాఖండ్ : కొన్నిసార్లు మన కళ్లముందు జరిగే కొన్ని విషయాలు అస్సలు అంతుపట్టవు. ఏ లాజిక్ కూ అందవు.. అలాంటి ఓ ఘటనే ఉత్తరాఖండ్ లో చర్చనీయాంశంగా మారింది. ఓ ఇంట్లో చంద్రగ్రహణం, భూకంపాల తరువాత జరిగిన పరిణామం ఆ ఇంటివారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా హల్ద్వానీలోని ఓ ఇంట్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఎనిమిది రోజులుగా రాత్రికి రాత్రే ఇంట్లో మంటలు చెలరేగుతున్నాయి.
చంద్రగ్రహణం నాటి నుంచి ఇలా జరుగుతోందని, దీంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నవంబర్ 8న చంద్రగ్రహణం ఏర్పడింది. అలాగే నవంబర్ 9న నేపాల్‌లో భూకంపం వచ్చింది. దీని ప్రభావం ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలపై పడింది. అందులో ఉత్తరాఖండ్ కూడా ఉంది. ఈ రెండు ఘటనల తర్వాత రాత్రిపూట తమ ఇంట్లో ఉన్నట్టుంది మంటలు చెలరేగుతున్నాయని, దీంతో ఎప్పుడేం జరుగుతుందో అనే భయంతో నిద్ర సరిగా పట్టడం లేదని ఇంటి సభ్యులు చెబుతున్నారు.
మా అంకుల్ రేప్ చేశాడు, తాతయ్య వేధించాడు.. ఇది తెలిసి నాన్న కూడా అత్యాచారం చేశాడు...బాలిక ఆవేదన..
ఈ ఘటన తరువాత.. వారు విద్యుత్ శాఖ అధికారులకు విషయం చెప్పడంతో వారు వచ్చి ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయితే విద్యుత్ బోర్డులు, వైర్లు కాలిపోతున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 8 రోజుల్లో 20 అగ్నిప్రమాదాలు జరిగాయన్నారు. వాటి కారణంగా అల్మారాలో ఉంచిన పరుపులు, బట్టలు కూడా కాలిపోయాయని వివరించారు. విద్యుత్తు సరఫరా లేకపోయినా ఆ ఇంట్లోని కూలర్‌లో తరచూ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగుతున్నాయి.
దీంతో విద్యుత్ అధికారులు ఇంట్లో ఎర్తింగ్ ఏర్పాటు చేశారు. దీంతో విద్యుత్ షాక్‌ను నివారించవచ్చని తెలిపారు. మంటలు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఎందుకో తెలియదు. చంద్రగ్రహణం సమయంలో ఏదో మార్పు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. మరికొందరు భూకంపం వల్ల మార్పు వచ్చిందని అంటున్నారు. ఇంతటి అగ్నిప్రమాదానికి కారణం అంతుచిక్కని మిస్టరీగా మారింది.
స్థానికులు ఆ ఇంటికి వచ్చి మంటలను చూశారు. కాలిన వస్తువులను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ మంటలు ఇలాగే కొనసాగితే శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేసే అవకాశాలున్నాయి. భూమి లోపల మండే వాయువుల లీకేజీ వల్ల ఇలా జరుగుతుందని నమ్ముతారు. భూకంపం కారణంగా వాయువులు లీకయ్యే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. గ్యాస్ లీక్ కాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అందుకే ఈ విషయం అంతుచిక్కని మిస్టరీగా మారిపోయింది.