Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. ఇంట్లో ఎక్కువగా ఉండటం లేదని మహిళా పోలీసును హతమార్చిన భర్త..

డ్యూటీలో బిజీగా ఉంటూ ఇంటికి సమయం కేటాయించలేదని ఓ మహిళా కానిస్టేబుల్ భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఓ హోటల్ గదిలో భార్యను దారుణంగా హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

Atrocious.. The husband who killed the woman policeman was not at home much..ISR
Author
First Published Oct 23, 2023, 6:48 AM IST

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తరువాత భార్యకు పోలీసు కొలువు వచ్చింది. దీంతో ఆమె ఉద్యోగంలో చేరింది. అయితే విధి నిర్వహణలో భాగంగా ఆమె ఇంటిని వదిలి వివిధ ప్రాంతాలకు వెళ్తుండేవారు. డ్యూటీలో బిజీగా ఉండేవారు. దీనిని భర్త జీర్ణించుకోలేకపోయాడు. తనతో ఎక్కువ సమయం గడపటం లేదని ఆగ్రహంతో ఆమెను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.

బిడ్డకు పెళ్లి చేసి ఆమె అత్తతో లేచిపోయిన తండ్రి.. చివరకు ఏం జరిగిందంటే?

వివరాలు ఇలా ఉన్నాయి. పాట్నాలోని జెహనాబాద్ కు చెందిన గజేంద్ర యాదవ్ తన భార్య శోభాకుమారి (23)తో కలిసి జీవిస్తుండేవారు. వారిద్దరూ ఆరు సంవత్సరాల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కొంత కాలం కిందట ఓ కూతురు జన్మించింది. గజేంద్ర యాదవ్ స్థానికంగా ఓ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తుండగా.. అతడి భార్యకు ఈ మధ్యే పోలీసు కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది.

మోడీ ఎప్పటికీ ప్రధాని కాకూడదు .. అదే నా లక్ష్యం : రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో ఒవైసీ కీలక వ్యాఖ్యలు

ఉద్యోగం వచ్చిన నాటి నుంచి ఆమె బిజీగా మారింది. విధి నిర్వహణలో భాగంగా శోభాకుమారి ఇంట్లో కంటే బయటే ఎక్కువగా ఉండేవారు. అయితే ఈ విషయం భర్తకు నచ్చలేదు. దీని వల్ల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. విసుగు చెందిన గజేంద్ర యాదవ్ తన భార్యను అంతం చేయలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే ఇటీవలో స్థానికంగా ఉన్న ఓ హోటల్ లో రూమ్ బుక్ చేశాడు.

'అగ్ని వీరుల దుస్థితి ఇది '.. రాహుల్ ట్వీట్ పై ఘాటు విమర్శలు..

అనంతరం భార్యకు కాల్ చేసి హోటల్ రూమ్ కు రావాలని ఆహ్మానించాడు. ఈ క్రమంలో అక్కడా ఇద్దరి మధ్య గొడవల జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన గజేంద్ర యాదవ్.. తన భార్యను దారుణంగా హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios