Asianet News TeluguAsianet News Telugu

బిడ్డకు పెళ్లి చేసి ఆమె అత్తతో లేచిపోయిన తండ్రి.. చివరకు ఏం జరిగిందంటే?

ఆ తండ్రి బిడ్డకు పెళ్లి చేశాడు. బిడ్డ అత్తతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ కలిసి ఇంటి నుంచి దూరంగా లేచిపోయారు. కానీ, చివరకు ఈ కథ విషాదాంతంగా మిగిలిపోయింది.
 

father affair with daughters mother in law, ended in tragedy kms
Author
First Published Oct 22, 2023, 10:34 PM IST | Last Updated Oct 22, 2023, 10:34 PM IST

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో 44 ఏళ్ల రామ్‌నివాస్ రాథోడ్‌‌కు సంతానంగా ఒక బిడ్డ ఉన్నది. భార్య మరణించింది. బిడ్డకు పెళ్లి చేయాలని అనుకున్నాడు. బిడ్డకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేశాడు. బిడ్డ అత్త పేరు ఆశా రాణి. ఆశారాణి దంపతులకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నాడు. రామ్ నివాస్ బిడ్డను, ఆశా రాణి కొడుకుకు ఇచ్చి ఈ ఏడాది మే నెలలో పెళ్లి చేశారు.

రామ్ నివాస్ రాథోడ్ తరుచూ తన బిడ్డ వద్దకు వెళ్లుతూ ఉండేవాడు. ఈ క్రమంతో ఆశా రాణితో పరిచయ గాఢత పెరిగింది. ఆశా రాణితో రామ్ నివాస్ ప్రేమలో పడ్డాడు. ఆశా రాణి కూడా రామ్ నివాస్ రాథోడ్ ప్రేమను తిరస్కరించలేదు. సెప్టెంబర్ 23వ తేదీన వారిద్దరూ ఇంటి నుంచి లేచిపోయారు. దీంతో ఆశారాణి కుటుంబానికి షాక్ తగిలింది. ఆశారాణి భర్త పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

రామ్ నివాస్ రాథోడ్, ఆశా రాణిలను గాలించడానికి పోలీసులు రంగంలోకి దిగారు. వీరిద్దరి సంబంధంతో రెండు కుటుంబాలు విస్మయం చెందాయి. నమ్మలేకపోయాయి. ఒక వేళ పోలీసులు తమను గాలించి పట్టుకుంటే తమ కుటుంబ సభ్యుల ఎదుట తాము ఎలా నిలబడగలం అనే ప్రశ్న ఆ తర్వాత రామ్ నివాస్ రాథోడ్, ఆశా రాణిలను వేధించింది. ఆ క్షణాలను వారు ఎదుర్కోలేమని అనుకున్నారు. చివరకు వారు ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు.

Also Read: పాలేరు సీటు కోసం కాంగ్రెస్ వర్సెస్ సీపీఎం.. పొంగులేటితో కాంగ్రెస్ హైకమాండ్ చర్చ!

వారిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. ఇద్దరూ ఓ ప్యాసింజర్ ట్రైన్ ముందు దూకారు. ఇద్దరూ మరణించారు. డెడ్ బాడీలను రికవరీ చేసుకున్నారు. కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ ఘటన యూపీలోని లఖింపూర్ ఖేరిలో చోటుచేసుకుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios